ప్రభుత్వ ఉద్యోగులకు HRA పెంపు.. అయినా సంతృప్తి లేదు!
vijayawada: ప్రభుత్వ ఉద్యోగుల(govt employees)కు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్(ap govt said good news) చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగుల హెచ్ఆర్ఏ పెంచుతూ(hra increased) బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే.. కొత్త జిల్లాల హెడ్‌క్వార్టర్‌లో పనిచేసే ఉద్యోగులకు మాత్రమే ఇది వర్తించనుంది. ఇక, హెచ్ఆర్ఏను 12 శాతం నుంచి 16 శాతానికి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పార్వతీపురం, పాడేరు, అమలాపురం, బాపట్ల, రాజమండ్రి, భీమవరం, నరసరావుపేట, పుట్టపర్తి, రాయచోటి జిల్లా కేంద్రాల్లో ఉద్యోగులకు పెంపు వర్తించనుంది.
పాత జిల్లాల్లో తాము 16% తీసుకుంటున్నామని ఉద్యోగులు చెబుతున్నారు. ఇక కొత్త జిల్లాకు వచ్చిన అనంతరం 4 శాతం తగ్గించి జిల్లాల విభజన అనంతరం 12 శాతం మాత్రమే ఇవ్వడం జరిగింది. జిల్లాల విభజన అనంతరం కొత్త జిల్లాల్లో పనిచేసిన ఉద్యోగులకు హెచ్ఆర్ఏ తగ్గింపుతో తీవ్ర నష్టం జరిగింది. జూన్ 2022 నుండి 12 శాతంగా మార్పు చేయడం వల్ల సుమారు 12 నెలల కాలానికి ఆఫీస్ సబార్డినేట్ స్థాయి ఉద్యోగి సుమారు 20 వేల రూపాయలు పైబడి, మిగతా ఉద్యోగులు 25 వేల నుండి 45 వేల రూపాయలు వరకు నష్టపోయినట్లు పలువురు ఉద్యోగులు వాపోతున్నారు. అయితే.. హెచ్ఆర్ఏ పెంచడంపై వారు హర్షం వ్యక్తం చేశారు. గతంలో ఉన్నదాన్నే.. మళ్లీ పునరుద్దిరించినట్లు పేర్కొన్నారు.