RAPO20: టైటిల్​ అనౌన్స్​మెంట్​ ఎప్పుడో తెలుసా?

Hyderabad: ఎనర్జిటిక్​ స్టార్​ రామ్ పోతినేని(Ram Pothineni) ప్రస్తుతం బోయపాటి శ్రీను(Boyapati Srinivas) దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లో RAPO20 వర్కింగ్​ టైటిల్​తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇస్మార్ట్​ శంకర్(Ismart Shankar)​ సినిమాతో మాస్​ జాతర చేసిన రామ్​ బోయపాటి డైరెక్షన్లో నటిస్తున్నాడంటే మరింత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఇక, ఇటీవల ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన పోస్టర్ ఆడియన్స్ లో భారీ అంచనాలను క్రియేట్ చేసింది. ఆ పోస్టర్ లో రామ్ రింగులు జుట్టు, గుబురు గడ్డంతో పక్కా మాస్ లుక్ లో కనిపించాడు.

కాగా ఈ సినిమాని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై చిట్టూరి శ్రీనివాస నిర్మిస్తున్నారు. ఇటీవల ఒక మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న శ్రీనివాస్​.. రామ్, బోయపాటి సినిమా గురించి అప్డేట్ ఇచ్చారు. మే 15వ తేదీన రామ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా పవర్ గ్లింప్స్ రిలీజ్ చేయబోతున్నట్లు వెల్లడించాడు. సినిమా టైటిల్ ఏంటి అనేది ఇప్పుడే చెప్పమని, దానికి కొంచెం సమయం పడుతుందని చెప్పుకొచ్చాడు.

ఈ సినిమాలో రామ్​ సరసన హీరోయిన్ గా శ్రీలీల (Sreeleela) నటిస్తుంది. పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రాన్ని ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నారు. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 20న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్​. వరుసగా రెండు ప్లాపులతో ఇబ్బందిపడుతున్న రామ్​ ఈ సినిమాతో ఎలాగైనా హిట్​ కొట్టాలని చూస్తున్నాడు. మరి రామ్​ బర్త్​డే సందర్భంగా విడుదల చేయనున్న గ్లింప్స్​ ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.