Game Changer: క్లైమాక్స్ షూట్ కంప్లీట్!

Hyderabad: ప్రపంచ వేదికపై ఆస్కార్(Oscar​ అందుకుని చరిత్ర సృష్టించిన RRR సినిమా తర్వాత రామ్ చరణ్(Ram Charan) నటిస్తున్న సినిమా గేమ్​ ఛేంజర్(Game Changer). కోలీవుడ్​​ స్టార్ డైరెక్టర్ శంకర్(Shankar) దర్శకత్వంలో RC15గా తెరకెక్కుతున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్​ జరుపుకుంటోంది.  ఈ సినిమాను భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్నారు. కియారా అద్వానీ(Kiara Advani) హీరోయిన్ గా నటిస్తుండగా, దిల్ రాజు(Dil Raju) ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాని వచ్చే సంక్రాంతికి(Sankranthi) రిలీజ్ చేసే అవకాశం ఉందని ఇదివరకే చెప్పారు నిర్మాత దిల్​ రాజు. కాగా ప్రస్తుతం డైరెక్టర్​ శంకర్​ ఈ సినిమా నుంచి ఓ తాజా అప్​డేట్​ అందించారు.

గేమ్ ఛేంజర్ షూట్​ నుంచి లీక్ అయిన స్టిల్స్​ ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. అంతేకాదు ఈ సినిమాలో చరణ్ డ్యూయల్ రోల్ చేయబోతున్నారు. గత కొద్దిరోజులుగా ఈ సినిమా క్లైమాక్స్ షూట్ జరుగుతోంది. హైదరాబాద్ లో వేసిన ఓ భారీ సెట్ లో దాదాపు 1000 కి మంది పైగా ఫైటర్స్ తో భారీ క్లైమాక్స్ ఫైట్ షూట్ చేసినట్టు సమాచారం.

కాగా, సెట్ లోంచి ఓ ఫోటోని షేర్ చేసి ‘అద్భుతమైన గేమ్ ఛేంజర్ క్లైమాక్స్ షూట్ ఇవాళ పూర్తి అవుతుంది. దీని తర్వాత ఇండియన్ 2 సినిమా షూటింగ్ కి వెళ్తాను’ అంటూ సోషల్​ మీడియాలో రాసుకొచ్చారు శంకర్​. అయితే ఈ సినిమా షూటింగ్ ఇంకా మిగిలే ఉందని, ఇప్పుడు కేవలం క్లైమాక్స్ పార్ట్ మాత్రమే అయినట్టు సమాచారం. ఇక శంకర్ ఇటు గేమ్ ఛేంజర్, అటు ఇండియన్ 2(Indian2) ఒకేసారి తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.