Adipurush: కాపీ రైట్స్​ వివాదం!

Hyderabad: యంగ్​ రెబల్​ స్టార్​ ప్రభాస్(Prabhas) హీరోగా బాలీవుడ్​ దర్శకుడు ఓం రౌత్(Om Raut)​ రూపొందించిన సినిమా ఆదిపురుష్(Adipurush). రామాయణం(Ramayanam) ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్​ రాముడిగా, కృతిసనన్(Krithi sanon) సీతగా, సైఫ్ అలీఖాన్(Saif Alikhan) రావణాసురుడిగా నటిస్తున్నారు. పాన్​ ఇండియా స్థాయిలో విడుదలవుతున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా జూన్​ 16న విడుదల కానుంది. భారీ బడ్జెట్​తో తెరకెక్కిన ఈ సినిమా మొదలైనప్పటి నుంచీ వరుస వివాదాల్లో చిక్కుకుంటోంది.  కొన్నాళ్ల కింద రిలీజైన టీజర్​పై భారీగా విమర్శలు రావడంతో విడుదలను వాయిదా వేసి గ్రాఫిక్స్​పై ఫోకస్​ చేసింది చిత్రబృందం. తాజాగా రిలీజైన ట్రైలర్​ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కాగా, ప్రస్తుతం ఈ చిత్రబృందం మరోసారి వివాదంలో చిక్కుకుంది.

సాధారణంగా ఇలా ట్రైలర్స్ రిలీజయినప్పుడు పలువురు యూట్యూబర్స్ ట్రైలర్స్, ట్రైలర్ లో స్క్రీన్ షాట్స్ తీసుకొని రియాక్షన్ వీడియోస్ చేస్తారు. వీటికి సాధారణంగా కాపీ రైట్ పడదు. కనీసం స్క్రీన్ షాట్స్ వదినా కాపీ రైట్ పడదు. కానీ ఆదిపురుష్ ట్రైలర్స్, స్క్రీన్ షాట్స్ వాడటంతో పలువురు యూట్యూబర్స్ కి కాపీ రైట్ పడింది. AiPlex అనే సంస్థ నుంచి కాపీ రైట్స్ పడుతున్నాయని, తమ వీడియోని బ్లాక్ చేసేశారని పలువురు యూట్యూబర్స్ ఆరోపిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ‘ఏ సినిమాకు ఇలా జరగలేదు. మేము ఇవి చేయడం వల్ల సినిమాకు కూడా ప్రమోషన్స్ అవుతాయి. కానీ మా మీద ఇలా ఆదిపురుష్ టీం ఇలా కాపీ రైట్స్ వేయడం కరెక్ట్ కాదు’ అని ఫైర్ అవుతున్నారు. మరి ఈ వివాదంపై చిత్రబృందం ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి.