karnataka elections: గెలుపు ఎవరిది? తెలుగు ఓటర్లే నిర్ణేతలా?

bengaluru: కర్నాటక ఎన్నికల(karnataka election campaign) ప్రచారం ముగిసింది. ఇక 10వ తేదీన పోలింగ్‌ జరగనుంది. ఈనేపథ్యంలో ఏ పార్టీ గెలుస్తుంది అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. కర్నాకటలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇందులో 113 మ్యాజిక్‌ ఫిగర్‌ తెచ్చుకున్న పార్టీ అధికారం కైవసం చేసుకుంటుంది. కానీ గత నాలుగు దశాబ్దాలుగా రెండు దఫాలు తప్పా అక్కడ ఏ పార్టీకి అధికారంలోకి వచ్చేంత మెజార్టీ సీట్లు రాలేదు. ఎక్కువ సార్లు హంగ్‌ అసెంబ్లీ(hung assemble) వచ్చింది. ఈ సారి కూడా పలు సర్వే సంస్థలు(survey organizations).. హంగ్‌ అసెంబ్లీ వస్తుందని పేర్కొన్నాయి. దీంతో ఏ పార్టీకి అధిక సీట్లు వస్తాయి.. అన్నది కీలకంగా మారింది. ప్రధాన పార్టీలు అయిన.. కాంగ్రెస్(congress), బీజేపీ(bjp)లు మ్యాజిక్‌ ఫిగర్‌ తెచ్చుకుంటాయని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఏదైనా ఈ నెల 13వ తేదీతో అసలు విషయం తెలిసిపోతుంది.

ఇక గత నెల రోజులుగా కర్నాటకలో ఎన్నికల ప్రచారం.. వైవిధ్యంగా సాగింది. ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. బీజేపీ పార్టీ కర్నాటకలో అవినీతి చేసిందని, అభివృద్ది లేదని తదితర అంశాలపై కాంగ్రెస్‌ ప్రచారంలో మాట్లాడింది. బీజేపీ.. కాంగ్రెస్‌ నేతలు చేసిన వ్యాఖ్యల చుట్టూ సాగింది. హిందుత్వం ప్రధాన అజెండాగా బీజేపీ ఎన్నికలకు వెళ్తోంది. ప్రధాని మోదీ మానియాను ఆ పార్టీ మరోసారి నమ్ముకుంది. మోదీ ఆధ్వర్యంలో అనేక సభలను నిర్వహించింది. కాంగ్రెస్‌ మాత్రం స్థానిక సమస్యలు, బీజేపీ చేసిన అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లింది. మరోవైపు 70 నియోజకవర్గాల్లో తెలుగు ఓటర్ల ప్రభావం ఉండనుంది. వీరు ఎరికి ఓటు వేస్తారు అన్నది కీలకం కానుంది. ఇప్పటికే తెలుగు ఓటర్లు ఉన్న ప్రాంతాల్లో తెలంగాణ, ఏపీకి చెందిన నాయకులు ప్రచారం నిర్వహించారు.