Vijay Deverakonda: బర్త్​డే ట్రీట్​.. అందరికీ ఐస్​క్రీమ్​ ఫ్రీ!

Hyderabad: కోస్టార్స్​తో పాటు అభిమానులకు సర్​ప్రైజ్​లు ఇవ్వడంలో ఎప్పుడూ ముందుంటాడు టాలీవుడ్ రౌడీ హీరో విజయ్​ దేవరకొండ(Vijay Deverakonda). ఈరోజు(మే 9న) విజయ్​ బర్త్​డే కావడంతో అభిమానులతోపాటు ప్రముఖులూ సోషల్ మీడియా వేడుకగా విజయ్​కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే విజయ్ తన పుట్టిన రోజు సందర్భంగా అందరికి స్పెషల్ ట్రీట్ ప్లాన్​ చేశారు. ఇటీవల విజయ్ దేవరకొండతో కలిసి ప్రముఖ ఐస్ క్రీం కంపెనీ క్రీంస్టోన్(Cream stone) తమ ఉత్పత్తుల్లో విజయ్ దేవరకొండ క్రియేషన్(Vijay Deverakonda Creation) పేరుతో ఓ ఫ్లేవర్ ఐస్ క్రీంని తయారు చేసింది. దీనిని స్వయంగా విజయ్ దేవరకొండ తయారుచేసి ఆ రోజు కొంతమందికి ఫ్రీగా అందించారు.
నేడు విజయ్ పుట్టిన రోజు కావడంతో కొన్ని ఐస్ క్రీం ట్రక్స్ ని రెంట్ కి తీసుకొని ‘ది దేవరకొండ బర్త్ డే ట్రక్’ అనే పేరుతో హైదరాబాద్, వైజాగ్, చెన్నై, బెంగుళూరు, ముంబై, పూణే, ఢిల్లీలో తిప్పుతూ ఫ్రీగా జనాలకు ఐస్ క్రీమ్స్ పంచిపెడుతున్నాడు. ఈ సందర్భంగా..‘‘ది దేవరకొండ బర్త్ డే ట్రక్’ అని కొన్ని ట్రక్స్ మీ సిటీలలో తిరుగుతాయి. అక్కడికి వెళ్లి ఇవాళ ఫ్రీగా ఐస్ క్రీమ్స్ తీసుకోండి. మీరు నాకు చాలా ప్రేమను అందించారు. నా తరపున మీకు ఈ చిన్న గిఫ్ట్. అంతేకాదు ఖుషి(Kushi) సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ కూడా ఇవాళే రిలీజ్ చేస్తున్నాం’ అంటూ ట్వీట్ చేశాడు ఈ రౌడీ హీరో. ఇక ఈ సినిమాలో విజయ్​కి జోడీగా సమంత నటిస్తున్న సంగతి తెలిసిందే. సమంత(Samantha) కూడా సోషల్​ మీడియా వేదికగా విజయ్​కి స్పెషల్​ బర్త్​డే విషెస్​ చెప్పింది.