Adipurush Trailer: ఫ్యాన్స్.. డై హార్డ్ ఫ్యాన్స్ ర‌చ్చ‌!

Hyderabad: యంగ్ రెబెల్ స్టార్ ప్ర‌భాస్(prabhas) గచ్చిబౌలిలోని ఏఎంబీ(amb mall) మాల్‌కు వ‌చ్చారు. ఆయ‌న న‌టించిన ఆదిపురుష్(adipurush) ట్రైల‌ర్‌ను ఏఎంబీ మాల్‌లో రిలీజ్ చేసారు. ఈ సంద‌ర్భంగా త‌న ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో క‌లిసి ట్రైల‌ర్ చూసేందుకు వ‌చ్చారు. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు హీరోయిన్ కృతి స‌న‌న్, డైరెక్ట‌ర్ ఓం రౌత్ కూడా వ‌చ్చారు. ప్ర‌భాస్‌ను చూసేందుకు ఏఎంబీ మాల్ ద‌గ్గ‌ర ఫ్యాన్స్ ఎగ‌బ‌డ్డారు. దాంతో గ‌చ్చిబౌలి మొత్తం జ‌న‌సంద్రంగా మారింది. ఇక‌పోతే.. ట్రైల‌ర్ మాత్రం అదిరిపోయింద‌ని సినీ విశ్లేష‌కులు అంటున్నారు. కొన్ని నెల‌ల క్రితం వ‌చ్చిన టీజ‌ర్ నిరుత్స‌హ‌ప‌ర‌చ‌డంతో ఎన్నో మార్పులు చేసార‌ని ఇప్పుడు ట్రైల‌ర్ చూసాక బాక్సాఫీస్ ద‌గ్గ‌ర కోట్లు కొల్ల‌గొడుతుంది అన‌డంలో ఏ సందేహం లేద‌ని అంటున్నారు.