Karnataka Elections: రాహుల్ గాంధీ వినూత్న ప్రచారం!
Karnataka: కర్నాటకలో అసెంబ్లీ ఎన్నికల(Karnataka Assembly Elections) పోరు హోరాహోరీగా సాగుతోంది. ప్రచార సమయం ముగుస్తుండటంతో జాతీయ, ప్రాంతీయ పార్టీల నేతలందరూ వినూత్నంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) సామాన్యులకు దగ్గరయ్యేందుకు కొత్త పద్ధతిని ఎంచుకున్నారు. ఆదివారం బెంగళూరు(Bengalore)లో కాంగ్రెస్ పార్టీ (Congress Party) తరఫున ప్రచారంలో పాల్గొని డెలివరీ బాయ్తో కలిసి స్కూటర్ పై చక్కర్లు కొట్టిన రాహుల్ ఈరోజు సిటీ బస్సులో ప్రయాణిస్తు మహిళలతో ముచ్చటించారు. బస్సులో ప్రయాణీకులతో, కాలేజీల్లో విద్యార్థులతో ముచ్చటిస్తు..ఉద్యోగస్తులతో మాటామంతీ కలుపుతు వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు రాహుల్ గాంధీ.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకున్న క్రమంలో రాహుల్ ప్రచారంలో జోరు పెంచారు. వినూత్నంగా సామాన్య మహిళలతో సిటీ బస్సులో ప్రయాణిస్తు ముచ్చటిస్తూ నిత్యావసరాల ధరల పెరుగుదల, గృహలక్ష్మి పథకం, మహిళలకు ఉచిత ప్రయాణంపై వంటి కాంగ్రెస్ మానిఫెస్టో గురించి వివరించి చెబుతున్నారు. పలు అంశాలపై సామాన్యుల అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఈరోజుతో ముగియనుంది. దీంతో వీలైనంతగా ప్రజల్లోకి వెళ్లేందుకు ఆయా పార్టీల నేతలు యత్నిస్తున్నారు. దీంట్లో భాంగానే రాహుల్ గాంధీ ఇలా వినూత్నంగా ప్రజల్లో తిరుగుతు వారితో ముచ్చటిస్తున్నారు.అలాగే సభలు, సమావేశాలు, రోడ్ షోలతో పాటు సామన్య ప్రజలతో కలిసిపోతు వారితో ముచ్చటిస్తున్నారు. అంతేకాదు ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ కన్నింగ్ హామ్ రోడ్డులో ఉన్న‘కేఫ్ కాఫీ డే’లో కాఫీ తాగారు. ఆ తరువాత బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ (బీఎంటీసీ) బస్ స్టాప్ కు వెళ్లారు. కాలేజీ విద్యార్ధులు,మహిళా ఉద్యోగులతో మాట్లాడారు.