Divorce: విడాకుల ఆనందంలో బంగీ జంప్.. తెగిన తాడు!
Brazil: విడాకులు(divorce) వచ్చాయన్న ఆనందంతో ఓ యువకుడు బంగీ జంప్‌తో(bungee jump) సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నాడు. కానీ ఆ తాడు తెగి మెడ విరగ్గొట్టుకున్నాడు. ఈ ఘటన బ్రెజిల్లో చోటుచేసుకుంది. 22 ఏళ్ల రఫేల్ అనే యువకుడు బ్రెజిల్‌లోని స్థానిక న్యాయస్థానం విడాకులు మంజూరు చేసింది. అప్పటివరకు భార్యతో విసిగిపోయి ఉన్న రఫేల్‌కు విడాకులు వచ్చాయన్న ఆనందంలో బంగీ జంప్ చేయాలనుకున్నాడు. 70 అడుగుల ఎత్తు నుంచి బంగీ జంప్ చేసాడు. కానీ దురదృష్టవశాత్తు తాడు మధ్యలోనే తెగిపోయింది. దాంతో రఫేల్ మెడ విరిగి తీవ్రగాయాలపాలయ్యాడు. వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్లడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ సందర్భంగా రఫేల్ మాట్లాడుతూ..”నేను నా మ్యారేజ్ లైఫ్‌లో చాలా అనుభవించాను. అందుకే విడాకులు రాగానే నా జీవితాన్ని బాగా ఎంజాయ్ చేయాలనుకున్నాను. నా ప్రాణాలను కూడా లెక్కచేయలేదు. కానీ ఈ ఘటన తర్వాత జీవితాన్ని కొత్తగా చూస్తున్నాను. నేను పాత రఫేల్‌లా ఉండాలనుకోవడం లేదు. ఇక ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తాను. కాకపోతే గతంలోలా నేను సరిగ్గా నిద్రపోలేకపోతున్నాను” అని వెల్లడించాడు.