Mutual Funds: యువ‌త చూపు మ్యుచువ‌ల్ ఫండ్స్ వైపు!

Hyderabad: యువ‌త(youth) పెట్టుబడుల‌పై(investments) ఎక్కువ ఆస‌క్తి చూపుతున్నారు. అందులోనూ ఎక్కువ‌గా మ్యుచువ‌ల్ ఫండ్స్‌కే(mutual funds) వారు ఓటు వేస్తున్నారు. గ‌త ఐదేళ్ల‌లో మ్యుచువ‌ల్ ఫండ్స్‌లో పెట్టుబ‌డులు పెడుతున్నవారి సంఖ్య 54%కి పెరిగింది. 54%లో దాదాపు 84 ల‌క్ష‌ల మంది మ్యుచువ‌ల్ ఫండ్ల‌లో పెట్టుబ‌డులు పెడుతున్నార‌ని క్యామ్స్ (కంప్యూట‌ర్ ఏజ్ మేనేజ్‌మెంట్ స‌ర్వీసెస్) నిర్వ‌హించిన స‌ర్వేలో వెల్ల‌డైంది. క్యామ్స్ ఇండియాలోనే అతిపెద్ద రిజిస్ట్రార్ మ‌రియు మ్యుచువ‌ల్ ఫండ్స్ యొక్క ట్రాన్స్‌ఫ‌ర్ ఏజెంట్ సంస్థ‌.

వీరంతా 2019 ఆర్థిక సంవ‌త్స‌రం నుంచి 2023 ఆర్థిక సంవ‌త్స‌రం వ‌ర‌కు పెట్టుబ‌డులు పెట్టిన‌వారు. అలా మ్యుచువ‌ల్ ఫండ్స్‌లో పెట్టుబ‌డి పెడుతూ వ‌చ్చిన వారి వ‌ద్ద ఇప్పుడు మొత్తం క‌లిపి 96,000 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. పెట్టుబ‌డులు పెట్టిన‌ 84 లక్ష‌ల మందిలో 26% మ‌హిళ‌లు ఉన్నారు. 84 ల‌క్ష‌ల మందిలో అంతా 30 టైర్-1 ప్ర‌దేశాల‌కు చెందిన‌వారిగా గుర్తించారు. డిజిట‌ల్‌గా పెట్టుబ‌డి పెట్టిన‌వారి సంఖ్య 75%. పెట్టుబ‌డుల గురించి మ్యుచువ‌ల్ ఫండ్స్ గురించి యువ‌త‌కు అర్థ‌మ‌య్యే విధంగా చేప‌ట్టిన స‌ర్వేలు, అవ‌గాహ‌నా స‌ద‌స్సుల వ‌ల్లే వారికి మ్యుచువ‌ల్ ఫండ్స్‌లో పెట్టుబ‌డులు పెట్టాల‌న్న ఆలోచ‌న బ‌లంగా క‌లిగింద‌ని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు.