రీరిలీజ్​కి ‘రెడీ’!

Hyderabad: టాలీవుడ్​(Tollywood) యంగ్​ హీరో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని(Ram Pothineni) కెరీర్‌లో మైల్​స్టోన్​గా నిలిచిన సినిమా ‘రెడీ’(Ready).దర్శకుడు శ్రీను వైట్ల(Srinu Vaitla) తెరకెక్కించిన ఈ ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్ అప్పట్లో సూపర్​డూపర్​ హిట్​గా నిలిచింది. రామ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్స్‌లో ఒకటిగా నిలిచిన ఈ సినిమా శ్రీను వైట్లకూ మంచి పేరు తీసుకొచ్చింది. ఇక ఈ సినిమాలో అందాల భామ జెనీలియా(Genelia D’Souza) హీరోయిన్‌గా నటించగా, రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్() ఈ సినిమాకు సంగీతం అందించారు.
అయితే, ఈ సినిమాను ఇప్పటికీ టీవీల్లో చూస్తూ కడుపుబ్బా నవ్వుకుంటారు అభిమానులు. తాజాగా ఈ సినిమాను రీ-రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. రామ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని మే 14న రీ-రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీని ప్రేక్షకులు థియేటర్లలో మరోసారి కచ్చితంగా ఎంజాయ్​ చేస్తారని ధీమా వ్యక్తం చేసింది చిత్రబృందం. సోషల్​ మీడియా వేదికగా రామ్​ పుట్టిన రోజున ఈ సినిమా రీరిలీజ్​ చేయనున్నట్లు ప్రకటించారు.
ఇక ఈ సినిమాను శ్రీను వైట్ల డైరెక్ట్ చేసిన విధానం ప్రేక్షకులను మరోసారి ఆకట్టుకోవడం ఖాయమని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమాను స్రవంతి రవికిషోర్ ప్రొడ్యూస్ చేశారు. కాగా, రామ్ ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో తన కెరీర్‌లోని 20వ చిత్రంలో నటిస్తున్నాడు. RaPo20 వర్కింగ్​ టైటిల్​లో తెరకెక్కుతున్న ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్​ 20న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్​.