NTR30: ఫ్యాన్స్‌కి తారక్ బర్త్‌డే ట్రీట్!
Hyderabad: యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) కొరటాల శివ(Koratala Siva) దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. NTR30 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాను అత్యంత భారీ అంచనాల మధ్య చిత్ర యూనిట్ రూపొందిస్తుండగా, ఈ సినిమాలో తారక్(Tarak) ఓ సరికొత్త పాత్రలో నటిస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi)తో రూపొందించిన ఆచార్య ఫలితంతో దెబ్బతిన్న కొరటాల ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ సక్సెస్ అందుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఇక ఈ సినిమాలో తారక్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్(Jahnvi Kapoor) హీరోయిన్గా నటిస్తోండగా ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమా అప్డేట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా, మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు కానుకగా కొరటాలతో తెరకెక్కిస్తున్న మూవీ నుండి ఫస్ట్ లుక్ పోస్టర్‌తో పాటు మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ మోషన్ పోస్టర్లో తారక్ వాయిస్ ఓవర్ గూస్బంప్స్ తెప్పించడం ఖాయమని తెలుస్తోంది. మరి ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా విడుదల చేసే ఈ గ్లింప్స్ అభిమానులను ఎలా మెప్పిస్తుందో చూడాలి మరి!