Adipurush Trailer Release: AMB మాల్​కు ప్రభాస్​.. ఇంకా ఎన్నో స‌ర్‌ప్రైజెస్!

Hyderabad: యంగ్​ రెబల్​ స్టార్ ప్రభాస్(Prabhas)​​ నటిస్తున్న మోస్ట్​ అవెయిటెడ్ మూవీ ఆదిపురుష్(Adipurush)​. ప్రముఖ ఇతిహాసం రామాయణం(Ramayanam) ఆధారంగా రూపొందుతున్న ఈ పాన్​ ఇండియా సినిమాలో ప్రభాస్​ శ్రీరాముడిగా, బాలీవుడ్​ భామ కృతి సనన్(Kriti sanon)​ సీతగా, సైఫ్​ అలీ ఖాన్​ (Saif Ali Khan)రావణుడిగా కనిపించనున్నారు. బాలీవుడ్​ ప్రముఖ​ దర్శకుడు ఓం రౌత్(Om Raut)​ రూపొందించిన ఈ సినిమా జూన్​ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్​ ప్రారంభించిన చిత్రబృందం వరుస అప్​డేట్స్​తో సినిమాపై బజ్​ క్రియేట్​ చేస్తోంది. ఈ సినిమా నుంచి ఇదివరకు విడుదలైన టీజర్​ ప్రేక్షకులను నిరాశపరచగా మే 9న ట్రైలర్​ రిలీజ్​ చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. కాగా, ఈ ట్రైలర్​ని పాన్​ వరల్డ్​ రేంజ్​లో 70 దేశాల్లో గ్రాండ్​గా విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా అభిమానులతో కలిసి ఈ సినిమా ట్రైలర్​ రిలీజ్ చేయడానికి డార్లింగ్​ ప్రభాస్ హైదరాబాద్​లోని​ ఏఎంబీ మాల్​(AMB Mall)లో సందడి చేయనున్నారు.
పాన్​ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా ప్రారంభం నుంచీ పలు వివాదాలను ఎదుర్కొంటోంది. 400 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తుండగా సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ఇదివరకే రిలీజైన టీజర్​పై సర్వత్రా విమర్శలు రావడంతో రిలీజ్​ని వాయిదావేసి గ్రాఫిక్స్​పై మరింత వర్క్​ చేస్తోంది చిత్రబృందం. ఆదిపురుష్ సినిమా రిలీజ్​ డేట్​ ప్రకటించిన మేకర్స్, ప్రమోషన్స్​ కూడా స్టార్ట్ చేశారు. ఇప్పటికే జై శ్రీరామ్ అనే లిరికల్ సాంగ్, కొన్ని పోస్టర్స్ రిలీజ్ చేయగా ఇప్పుడు ఆదిపురుష్ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేయడానికి రెడీ అయ్యింది చిత్రయూనిట్. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులు ఈ ట్రైలర్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సినిమా రిలీజ్ కు ఏకంగా నెల రోజుల ముందే ట్రైలర్ ని విడుదల చేయడం విశేషం.