Ranbir Kapoor: బాలీవుడ్​ ప్రేక్షకులను అలరించలేకపోతోంది!

Mumbai: ఇండియన్​ సినిమా(Indian Cinema) అంటే బాలీవుడ్(Bollywood)​ అనేంతగా పాపులర్​ అయిన హిందీ సినిమా(Hindi Cinema) కొన్నాళ్లుగా ప్రేక్షకులను అలరించలేకపోతోంది. చాలారోజులుగా సరైన హిట్​లేక వెలవెలబోతున్న బాలీవుడ్​కి పఠాన్​(Pathan)తో హిట్​ ఇచ్చి మరోసారి బాలీవుడ్​ బాద్​షాగా నిరూపించుకున్నారు షారుఖ్​ ఖాన్​(Shah Rukh Khan). అయితే ఈ సినిమా కూడా బాలీవుడ్​ని సక్సెస్​ బాట పట్టించలేకపోతోంది. బాలీవుడ్​ స్టార్​ హీరోలైన సల్మాన్ ఖాన్(Salman Khan)​, అమీర్​ ఖాన్(Aamir Khan)​, అక్షయ్​ కుమార్(Akshay Kumar)​ సినిమాలు వరుసగా డిజాస్టర్లుగా నిలవడమే ఇందుకు ప్రధాన కారణం. చాలా రోజులుగా బాయ్​కాట్​ ట్రెండ్​తో విడుదలైన ప్రతి సినిమా నెగిటివిటీని మూటగట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్​ నటులంతా దక్షిణాది సినిమాలపై ఫోకస్ పెడుతున్నారు. తాజాగా బాలీవుడ్​ ఈ పరిస్థితిని ఎదుర్కోడానికి గల కారణాలను చెప్పుకొచ్చారు హీరో రణ్​బీర్​ కపూర్(Ranbir Kapoor)​.

రణ్​బీర్​ మాట్లాడుతూ.. ‘బాలీవుడ్​ సినిమా ప్రేక్షకులకు కావల్సిన సినిమాలు అందించడంలో తడబడుతోంది. ఏ తరహా సినిమాలు అందించాలనే విషయంలో హిందీ చిత్ర పరిశ్రమ అయోమయంలో పడింది. వెస్ట్రన్‌ సినిమా ప్రభావానికి లోనుకావడమే ఇందుకు కారణం. గత ఇరవై ఏళ్ళుగా… బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ.. ఫిల్మ్ మేకింగ్ లో తడబడుతుంది.. ఫిలిం మేకింగ్‌లో కన్ఫ్యూజ్‌ అవుతుంది. ఏ తరహా సినిమాలతో సక్సెస్ సాధించవచ్చు అనే విషయంలో.. స్పష్టతను అంతకంతకూ కోల్పోతోంది. అంతే కాదు హాలీవుడ్ ను ఫాలో అవ్వడం, ఆ సినిమాలు రీమేక్ చేయడం.. ఆ స్టైల్ ను పులుముకోవడం వల్లే ఈపరిస్థితి వచ్చింది’ అన్నారు. కొంతమంది హీరోహీరోయిన్లు కొత్తవారికి ఏమాత్రం అవకాశం ఇవ్వడం లేదని.. వారు ఈ పద్ధతిని మార్చుకుంటే, ఇండస్ట్రీలో కొత్త ట్యాలెంట్స్ బయటకొస్తాయని.. అప్పుడు మళ్లీ ఇండస్ట్రీ సక్సెస్ బాటలో పయనిస్తుందని అన్నారు రణ్​బీర్​. ప్రస్తుతం రణ్​బీర్​ వ్యాఖ్యలు నెట్టింట వైరల్​గా మారాయి.