Jawan: న‌య‌న్-షారుక్ మూవీ.. రిలీజ్ డేట్ ఫిక్స్

Mumbai: బాలీవుడ్(Bollywood) బాద్​సా షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) ‘పఠాన్’(Pathan) సినిమాతో బ్లాక్​బస్టర్​ హిట్​ అందుకున్నారు. స్పై యాక్షన్ థ్రిల్లర్ రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. చాలాకాలంగా హిట్​కోసం ఎదురు చూస్తున్న షారుఖ్​కి ఈ సినిమా బూస్ట్​ ఇచ్చినట్లయింది. అందుకే తన తదుపరి సినిమా అయిన జవాన్(Jawan)​ని త్వరగా పూర్తి చేసే పనిలో పడ్డారు. ఈ సినిమాని కోలీవుడ్​ దర్శకుడు అట్లీ(Atlee) రూపొందిస్తున్నారు.

ఈ సినిమా అనౌన్స్​మెంట్​ చాలారోజుల కిందే వచ్చినా విడుదల తేదీని వాయిదా వేస్తూ వచ్చారు మేకర్స్​. కాగా ప్రస్తుతం ఈ సినిమా రిలీజ్ డేట్​ని అనౌన్స్​ చేసి అభిమానులను సర్​ప్రైజ్​ చేశారు. ఈ సినిమాలో షారుఖ్ మరోసారి తనదైన యాక్షన్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమాలో తమిళ వర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి(Vijay Sethupathi) విలన్‌గా నటిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను మొదట జూన్ 2న రిలీజ్ చేస్తామని ప్రకటించగా, తాజాగా జవాన్ మూవీ రిలీజ్ డేట్‌ను చిత్ర యూనిట్ వాయిదా వేస్తూ అనౌన్స్ చేశారు.

జవాన్ మూవీని సెప్టెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈమేరకు ఓ అనౌన్స్‌మెంట్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాలో లేడీ సూపర్​స్టార్​ నయనతార(Nayanatara) హీరోయిన్‌గా నటిస్తోండగా, దీపికా పదుకొనే(Deepika Padukone) ఓ కేమియో పాత్రలో నటిస్తోంది. రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై గౌరీ ఖాన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.