AP SSC Results: బాలికలదే పైచేయి!
Vijayawada: ఆంధ్రప్రదేశ్ (AP) పదో తరగతి పరీక్ష ఫలితాల్లో(SSC Results) మరోసారి బాలికలే పైచేయి సాధించారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మంత్రి బొత్స సత్యనారాయణ (Minister Botsa Satyanarayana) విజయవాడలో పదో తరగతి ఫలితాలను విడుదల చేశారు. పరీక్ష హాజరైన విద్యార్థుల్లో 72.26 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో 75.38 శాతం మంది బాలికలు ఉండగా, 69.27 శాతం మంది బాలులు ఉన్నారు. 933 స్కూల్స్‌లో 100 శాతం ఉత్తీర్ణత రాగా, 38 పాఠశాల్లో సున్నా శాతం ఉత్తీర్ణత నమోదయింది. కాగా, ఉత్తీర్ణ సాధించినవారిలో 75.8 శాతం మందికి ఫస్ట్ క్లాస్ రాగా.. పాసైనవారిలో ఇంగ్లిష్ మీడియాలో రాసిన స్టూడెంట్ 80 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.
ఈ ఏడాది ఏప్రిల్ 3 నుంచి 18 వరకు నిర్వహించిన పరీక్షలకు మొత్తం 6,05,052 మంది విద్యార్థులు హాజరయ్యారు. వారిలో బాలురు 3,09,245, బాలికలు 2,95,807 మంది హాజరైన వారిలో ఉన్నారు. పరీక్షల్లో ఫెయిల్ అయినవారికోసం జూన్ 2 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి బొత్స తెలిపారు. విద్యార్థులకు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు ఈనెల 13వరకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.
వందకు వందశాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలలకు, అత్యధిక శాతం మార్కులు సాధించిన విద్యార్థులకు, ఆయా స్కూల్ టీచర్లను పోత్సహించే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు ఎలాంటి అఘాయిత్యాలు పాల్పడొద్దని.. పరీక్షలో ఫెయిల్ అయిన వారికి ప్రత్యేకంగా కోచింగ్ ఇప్పిస్తామని వెల్లడించారు. విద్యా సంవత్సరం వృథా కాకుండా వెంటనే ఫలితాలను ప్రకటిస్తామని చెప్పారు.
పదో తరగతి పరీక్షాఫలితాలను https://results.bse.ap.gov.in వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు.