Kangana Ranaut: మీకు తప్పుగా అనిపిస్తే మీరూ టెర్రరిస్టులే!

Mumbai: బాలీవుడ్​ ఫైర్​బ్రాండ్ కంగనా రనౌత్(Kangana Ranaut)​ ది కేరళ స్టోరీ(The Kerala story) సినిమాకి మద్దతుగా సంచలన వ్యాఖ్యలు చేసి​ మరోసారి వార్తల్లో నిలిచారు. మే 5న విడుదలైన ఈ సినిమాపై ముందునుంచే పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సినిమాను అడ్డుకోవాలని చాలామంది ప్రయత్నించారు. కాగా హైకోర్టు సినిమా విడుదలకు గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చింది. ప్రధాని మోడీ(PM Modi) సైతం కర్ణాటక ఎలక్షన్స్ ప్రచారంలో ది కేరళ స్టోరీ సినిమాని సమర్థిస్తూ మాట్లాడారు. పలు చోట్ల మాత్రమే రిలీజయిన ది కేరళ స్టోరీ సినిమాకి మంచి ఆదరణ లభిస్తుంది. ఇందులో ఉగ్రవాదంకు వ్యతిరేకంగా చూపించడంతో ఈ సినిమాకు సపోర్ట్ గా పలువురు మాట్లాడుతున్నారు. తాజాగా కంగనా ఈ సినిమాకు మద్దతుగా మాట్లాడారు.

కేరళలో(Kerala) కొంతమంది అమ్మాయిలను మతం మార్చి టెర్రరిజంలోకి తీసుకెళ్తున్నారు అనే రియల్ సంఘటనల ఆధారంగా వచ్చిన సినిమా ది కేరళ స్టోరీ(The Kerala Story). ఈ సినిమాలో అదా శర్మ(Adah Sharma), సిద్ది ఇదాని(Siddhi Idnani), యోగితా.. ముఖ్య పాత్రల్లో నటించారు. సుదీప్తో సేన్ ఈ సినిమాని తెరకెక్కించాడు.

కంగనా రనౌత్ మాట్లాడుతూ..‘నేను సినిమా ఇంకా చూడలేదు. హైకోర్టు కూడా సినిమాని నిషేధించాల్సిన అవసరం లేదని తీర్పు ఇచ్చినా కొంతమంది ఈ సినిమాని అడ్డుకుంటున్నారు. ఈ సినిమా ISIS ఉగ్రవాద సంస్థ గురించి తప్పుగా చూపించింది. అలా తప్పులు చేసే వాళ్ళ గురించి చూపిస్తే ఈ సినిమాకు సపోర్ట్ చేయాల్సింది పోయి సినిమాను అడ్డుకుంటున్నారు. అంటే అది ఉగ్రవాద సంస్థ కాదు అని మీరు సపోర్ట్ చేస్తే మీరు కూడా ఉగ్రవాదులే అవుతారుగా. ఈ సినిమా ISIS ఉగ్రవాదులకు వ్యతిరేకంగా తీసింది. అది మీకు వ్యతిరేకంగా అనిపిస్తే మీరు కూడా ఉగ్రవాదులే అవుతారు’ అని కంగనా వ్యాఖ్యానించింది. ప్రస్తుతం కంగనా వ్యాఖ్యలు వైరల్​గా మారాయి.