Smriti Irani: నేను జ్యోతిష్యురాలిని కాను కానీ.. గెలిచేది మేమే

Bengaluru: రాబోయే క‌ర్ణాట‌క ఎన్నిక‌ల్లో(karnataka elections) గెలిచేది తామేన‌ని ధీమా వ్య‌క్తం చేసారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ(smriti irani). కాంగ్రెస్‌(congress), బీజేపీ(bjp) నువ్వా నేనా అన్న‌ట్లు పోటీ ప‌డుతున్నాయి. ప్ర‌చారంలో భాగంగా కాంగ్రెస్ భ‌జ‌రంగ్ ద‌ళ్‌ను పూర్తిగా నిర్మూలిస్తామ‌ని చెప్ప‌డంతో ర‌చ్చ జ‌రుగుతోంది. దాంతో స్మృతి కాంగ్రెస్‌పై విరుచుకుప‌డ్డారు. “కాంగ్రెస్ హిందూ సెంటిమెంట్ల‌ను అస‌లు ప‌ట్టించుకోద‌ని, హిందువుల‌కు సంబంధించిన ఏ సంస్థ అయినా అది ఉగ్ర‌వాద సంస్థ‌తో స‌మానంగా చూస్తుందని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తే భ‌జ‌రంగ్ ద‌ళ్‌, పీఎఫ్ ఐ వంటి సంస్థ‌ల‌ను నిర్మూలిస్తానంటోంది. దీనిని బ‌ట్టి చూస్తేనే కాంగ్రెస్‌కు హిందువులంటే ఇష్టం లేద‌ని తెలుస్తోంది. నేను జ్యోతిష్యురాలిని కాను కానీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలిచేది బీజేపీనే అని క‌చ్చితంగా చెప్ప‌గ‌ల‌ను” అని తెలిపారు.