ల‌క్ష‌ల్లో టిప్‌.. ఉద్యోగం నుంచి తీసేసిన రెస్టారెంట్!

America: రెస్టారెంట్‌లో(restaurant) ఫుడ్, ఫుడ్ వ‌డ్డించే విధానం.. ఇలా అన్నీ బాగుంటే క‌స్ట‌మ‌ర్ కాస్త హ్యాపీగా ఫీలై వెయిట‌ర్ల‌కు(waiter) ఎంతో కొంత టిప్ ఇస్తారు. వెయిట‌ర్ల‌కు మంచి టిప్ వ‌స్తోందంటే.. వాళ్లు బాగా ప‌నిచేస్తున్నార‌ని అర్థం. కానీ ఓ మ‌హిళా వెయిట‌ర్‌కి ల‌క్ష‌ల్లో టిప్ రావ‌డంతో ఆమెను అభినందించాల్సిందిపోయి ఉద్యోగం నుంచి తీసేసింది ఓ రెస్టారెంట్. ఈ ఘ‌ట‌న అమెరికాలో జ‌రిగింది. ఆర్కాన్సాస్ ప్రాంతంలోని ఓ రెస్టారెంట్‌లో ప‌నిచేస్తోంది ర‌యాన్. ఓరోజు ఆ రెస్టారెంట్‌కు ఒక 30 మంది ఉన్న టీం లంచ్‌కి వ‌చ్చింది. వారికి ర‌యాన్ ఏ లోటూ లేకుండా ఫుడ్ స‌ర్వ్ చేసారు. ఇందుకు ర‌యాన్‌కు ఆ టీం అంతా క‌లిసి 4,400 డాల‌ర్లు అంటే మ‌న క‌రెన్సీలో దాదాపు రూ.3.6 ల‌క్ష‌లు టిప్‌గా ఇచ్చింది.

దాంతో ఆమె ఎంతో సంతోషించింది. ఈ విష‌యం మేనేజ‌ర్‌కు తెలీడంతో 20% మాత్ర‌మే తీసుకుని మిగ‌తాది ఇత‌ర వెయిట‌ర్ల‌తో పంచుకోవాల‌ని అన్నాడు. అందుకు ర‌యాన్ ఒప్పుకోలేదు. క‌ష్ట‌ప‌డింది నేనైతే మిగ‌తావారికి ఎందుకు ఇస్తాను అని ఎదురు తిరిగింది. దాంతో ఆ మేనేజ‌ర్ ఆమెను ఉద్యోగం నుంచి తీసేసాడు. దాంతో త‌న‌కు న్యాయం కావాలంటూ ర‌యాన్ స్థానిక మీడియా వ‌ర్గాల‌ను సంప్ర‌దించింది. చ‌దువు కోసం తీసుకున్న లోన్ చెల్లించాల‌ని కానీ రెస్టారెంట్ త‌న‌ను ఉద్యోగం నుంచి తొల‌గించింద‌ని వాపోయింది. ఈ విషయాన్ని ర‌యాన్ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయ‌డంతో ఎంతో మంది దాతలు త‌మ‌కు తోచినంత సాయం చేసారు.