Shaakuntalam: అప్పుడే ఓటీటీలోకి!

Hyderabad: టాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​ సమంత(Samantha) ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం శాకుంతలం(Shaakuntalam). ఈ సినిమా ఏప్రిల్​ 14న ప్రపంచ వ్యాప్తంగా రిలీజై ప్రేక్షకులను నిరాశ పరిచిన సంగతి తెలిసిందే. కాగా సినిమా థియేట‌ర్ల‌లో విడుద‌లై నెల రోజుల కాక‌ముందే ఈ సినిమా ఓటీటీ(OTT)లోకి రాబోతున్న‌ది. మే 12న ఈ సినిమా అమెజాన్ ప్రైమ్(Amaz0n Prime) ఓటీటీలో రిలీజ్ కానుంది. ఈ సినిమా ఓటీటీ హ‌క్కుల‌ను అమెజాన్ ప్రైమ్ థియేట‌ర్ రిలీజ్‌కు ముందే సొంతం చేసుకున్న‌ట్లు స‌మాచారం.

మే 12న తెలుగు, హిందీతో పాటు ఇత‌ర ద‌క్షిణాది భాష‌ల్లోనూ ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కానున్న‌ట్లు తెలిసింది. గుణ శేఖర్​ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా క‌థ‌, గ్రాఫిక్స్‌, ప్రొడ‌క్ష‌న్ వాల్యూస్‌తో ప్ర‌ధాన పాత్ర‌ధారుల యాక్టింగ్‌పై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లొచ్చాయి. దాదాపు అర‌వై కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ఇర‌వై కోట్ల‌లోపే వ‌సూళ్ల‌ను రాబ‌ట్టి నిర్మాత‌ల‌తో పాటు డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు తీవ్రంగా న‌ష్టాల‌ను మిగిల్చింది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్​ రాజు నిర్మించారు. ఈ సినిమా తనకు భారీ షాక్​ ఇచ్చిందటూ దిల్​ రాజు కూడా ఓపెన్​గానే ప్రకటించారు.
ఇక, ప్రస్తుతం సమంత సిటాడెల్(Citadel)​ ఇండియన్​ వెర్షన్​తో ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయ్​ దేవరకొండ(Vijay Deverakonda), సమంత జంటగా శివ నిర్వాణ(Shiva Nirvana) దర్శకత్వంలో ఖుషి(Kushi) సినిమా రూపొందుతోంది. ఈ సినిమాను సెప్టెంబర్​ 1న గ్రాండ్​గా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్​.