Naga chaitanya: విడాకుల ప్ర‌శ్న‌లు.. త‌మిళ మీడియాతో క‌ష్ట‌మే..!

Hyderabad: యువ సామ్రాట్ అక్కినేని నాగ‌చైతన్య(naga chaitanya) ఏ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్నా.. స‌మంత‌తో(samantha) జ‌రిగిన విడాకుల(divorce) గురించి ప్ర‌శ్న‌లు ఎదురవుతూనే ఉంటాయి. ఆయ‌న న‌టించిన క‌స్ట‌డీ(custody) సినిమా 12న రిలీజ్ అవ‌బోతోంది. ఈ సినిమాను తెలుగులోనే కాకుండా త‌మిళంలోనూ రిలీజ్ చేస్తున్నారు. ఎందుకంటే.. ఈ సినిమాను తీసిన డైరెక్ట‌ర్ వెంక‌ట్ ప్ర‌భు త‌మిళ వ్య‌క్తి. కాబ‌ట్టి ఇక్క‌డే కాకుండా త‌మిళ‌నాట కూడా చై ప్ర‌మోష‌న్స్, ఇంట‌ర్వ్యూల్లో పాల్గొనాల్సి ఉంటుంది. అయితే.. ఇక్క‌డ చై పీఆర్ టీం ద్వారా విడాకుల ప్ర‌శ్న‌ల గురించి అడ‌గ‌కుండా చూసుకోగ‌లుగుతారు. కానీ తమిళ‌నాట అలా కుద‌ర‌దు. చై, సామ్ డైవ‌ర్స్(chay sam divorce) త‌మిళ ఇండ‌స్ట్రీలోనూ హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఇప్పుడు చెన్నైలో పాల్గొనే ప్ర‌మోష‌న్స్ లేదా ప్రెస్ మీట్ స‌మ‌యంలో విడాకుల గురించి త‌ప్ప‌కుండా ఏదో ఒక ప్ర‌శ్న ఎదుర‌వుతుంది. ఇక్క‌డ పీఆర్ చేత డీల్ చేయించిన‌ట్లు అక్క‌డ ఉండ‌దు. మ‌రి త‌మిళ మీడియాను చై ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాలి.