Custody: ఏంటి చై.. నీ వ‌ల్ల నాకు హిట్ వ‌చ్చిందా?

Hyderabad: కృతి శెట్టి(krithi shetty).. నాగ‌చైత‌న్య‌ను(naga chaitanya) ఆటప‌ట్టించారు. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన క‌స్టడీ(custody) సినిమా 12న‌ రిలీజ్ అవ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా టీం ప్రెస్ మీట్‌లో పాల్గొంది. ఆ స‌మ‌యంలో ఓ జ‌ర్న‌లిస్ట్‌.. కృతిని అడిగిన ప్ర‌శ్న‌కు ఆమె కాస్త బోల్డ్‌గా ఆన్స‌ర్ ఇచ్చారు. కృతి, నాగ‌చైత‌న్య కాంబినేష‌న్‌లో బంగార్రాజు సినిమా వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే ఆ సినిమాకి ముందు ఉప్పెన ఒక్క‌టే కృతి ఖాతాలో హిట్‌గా నిలిచింది. బంగార్రాజు త‌ర్వాత వ‌చ్చిన సినిమాలు కూడా పెద్ద‌గా హిట్ అవ్వ‌లేదు. దాంతో క‌స్ట‌డీ సినిమాతో మ‌ళ్లీ నాగ చైత‌న్య వ‌ల్లే హిట్ కొడ‌తారా? అని ఓ జ‌ర్న‌లిస్ట్ కృతిని అడిగారు.

ఇందుకు ఆమెకు కాస్త మండిన‌ట్లుంది. వెంట‌నే చై వైపు చూస్తూ.. ఏంటి నాకు హిట్ మీవ‌ల్ల వ‌చ్చిందా? అని అడిగారు. ఇందుకు చైత‌న్య స్పందిస్తూ.. నాదేం లేదు మీ హార్డ్‌వ‌ర్క్ వ‌ల్లే అయింది అన్నారు. ఆ త‌ర్వాత కృతి జ‌ర్న‌లిస్ట్‌కి ఆన్స‌ర్ ఇస్తూ.. “సినిమా ఒక‌రి వ‌ల్లే హిట్ అవుతుంది అని చెప్ప‌లేం. అఫ్‌కోర్స్ అందులో నాగార్జునలాంటి పెద్ద యాక్ట‌ర్ ఉండ‌టం కూడా సినిమాకు ప్ల‌స్ పాయింట్‌. కానీ స్టోరీ కూడా అంతే ఎంట‌ర్‌టైనింగ్‌గా ఉంది. అందులోనూ సంక్రాంతికి రిలీజ్ అయింది. ఆ సినిమా స‌క్సెస్ అయిందే సంక్రాంతి సంద‌ర్భంగా రిలీజ్ చేసినందుకు” అని కాస్త బోల్డ్‌గా రిప్లై ఇచ్చారు.