Bajrang Dal నిషేధంపై స్వరం మార్చిన కాంగ్రెస్‌.. ఎందుకంటే?

bengaluru: విశ్వహిందూ పరిషత్‌ అనుబంధ సంస్థ(Vishva Hindu Parishad) (VHP) అయిన బజరంగ్‌ దళ్‌(Bajrang Dal) , ముస్లిం రాడికల్‌ సంస్థ పీఎఫ్‌ఐ(pfi)ను బ్యాన్‌ చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ తన ఎన్నికల మ్యానిఫెస్టో(congress manifesto)లో ప్రకటించింది. ఇక దీనిపై కర్నాటక రాష్ట్రం(karnataka state)లో అలజడి మొదలైంది. ఎన్నికల వేళ కాంగ్రెస్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో.. హిందువులను అనగదొక్కేందుకు కుట్ర పన్నుతున్నారని.. బీజేపీ పెద్దఎత్తున ప్రచారం చేస్తోంది. ఈ విషయాన్ని ప్రధాని మోదీ(pm modi responded) కూడా ప్రస్తావించారు. కాంగ్రెస్‌ పార్టీ ఉగ్రవాదులను పెంచిపోషించాలని చూస్తోందని, ఆ పార్టీకి వ్యతిరేకంగా దేశ శ్రేయస్సుకోరుకునే వారు ఏకం కావాలని మోదీ పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌పై ఉన్న కోపాన్ని బీజేపీకి ఓటు వేసి.. హిందువులు తన నిరసన తెలియజేయాలని. ఓటు వేసేముందు జై బజరంగ్‌ బలి అని మనసులో నినదించాలని కోరారు. మరోవైపు ఇవాళ కర్నాటక రాష్ట్ర వ్యాప్తంగా హునుమాన్‌ చాలీసా పారాయణం చేయాలని హిందూ సంఘాలు పిలుపునిచ్చాయి. ఈక్రమంలో ఎన్నికల్లో తమకు ఎదురుదెబ్బ తగులుతుందని భావించిన కాంగ్రెస్‌ దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. ఎలాంటి సంస్థలను రద్దు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండదని.. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే.. రాడికల్‌ సంస్థలను రద్దు చేయమని పలువురు నేతలు ప్రకటించారు.

కర్నాటకలో కాంగ్రెస్‌కు అనుకూల పవనాలు వీస్తున్న వేళ.. అనవసరమైన విషయాలవైపు ఆ పార్టీ దృష్టి సారించి.. ప్రత్యర్థుల వలలో చిక్కుకుంటోంది. తాజాగా కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన మ్యానిఫెస్టోలో బజరంగ్‌దళ్‌, పీఎఫ్‌ఐని బ్యాన్‌ చేస్తానని చెప్పి బీజేపీ నేతలకు అవకాశం ఇచ్చింది. వాస్తవానికి కర్నాటకలో అల్లర్లు చెలరేగకుండా.. రాడికల్‌ సంస్థలను బ్యాన్‌ చేస్తామని కాంగ్రెస్‌ ఉద్దేశంగా చెబుతుండగా. బీజేపీ మాత్రం దీన్ని అవకాశంగా తీసుకుని హిందువుల మనోభావాలను కాంగ్రెస్‌ దెబ్బతీస్తోందని ఆరోపిస్తోంది. కర్నాటక మాజీ సీఎం కాంగ్రెస్‌ నాయకులు వీరప్ప మోయిలీ, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్‌ మీడియాతో మాట్లాడారు. తాము ఏ సంస్థను రద్దు చేయమని పేర్కొన్నారు.