Army: క‌శ్మీర్‌లో కూలిన ఆర్మీ హెలికాప్ట‌ర్

Srinagar: జ‌మ్మూ & క‌శ్మీర్‌లో(jammu & kashmir) ALH ధృవ్ అనే ఓ ఆర్మీ హెలికాప్ట‌ర్(army helicopter) కూలిపోయింది. ఈ ఘ‌ట‌న‌లో ఒక‌రు మృతిచెంద‌గా.. ఇద్ద‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. కిష్ట్వ‌ర్ జిల్లాలోని మార్వా ప్రాంతంలో ఈ ఘ‌ట‌న జ‌రిగింది. హెలికాప్ట‌ర్ కూలిన త‌ర్వాత మ‌రుసుదార్ న‌దిలో కొట్టుకుపోయింద‌ని ఆర్మీ అధికారులు తెలిపారు. పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.