Dimple Hayathi: నాకు బంగారంతో గుడి కట్టండి!

Hyderabad: టాలీవుడ్​ హీరో గోపీచంద్​(Gopichand), డింపుల్​ హయాతీ(Dimple Hayathi) జంటగా నటించిన తాజా చిత్రం రామబాణం(Ramabanam).  శ్రీవాస్(Sriwass)​ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా  మే 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంది.

మూవీ ప్రమోషన్స్​లో భాగంగా డింపుల్​ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించింది. ఫాన్స్ అడిగిన ప్రశ్నలకి ఓపికగా సమాధానాలు చెప్పింది. అయితే.. అందులో ఒక అభిమాని అత్యుత్సాహాన్ని ప్రదర్శించాడు.  ‘మీకు గుడి కట్టాలి అనుకుంటున్నాను. ఇటుకలతో కట్టాలా లేక పాలరాయితో కట్టాలా?’ అని డింపుల్ ని ప్రశ్నించాడు.  ఈ ప్రశ్నకు డింపుల్ హయాతీ అదిరిపోయే ఆన్సర్ ఇచ్చింది. ‘నిజంగా నాకు గుడి కట్టే ఆలోచన నీకు ఉంటే బంగారంతో కట్టాలి’ అని సూచించింది. డింపుల్ ఇచ్చిన సమాధానానికి నెటిజన్స్ ‘సూపర్ కౌంటర్ ఇచ్చారు మేడమ్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

తమిళనాడులో సినీతారలకు గుడి కట్టే కల్చర్​ చాలా రోజుల నుంచి కొనసాగుతోంది. ఖుష్బూ, హన్సిక వంటి పలువురు హీరోయిన్లకు గుడి కట్టి కొందరు వారిపై తమ అభిమానాన్ని చాటుకున్నారు.  తాజాగా ఆంధ్రప్రదేశ్​లోనూ ఓ అభిమాని సమంతకు గుడి కట్టిన విషయం తెలిసిందే.