OG సెట్లో అకీరా నందన్​.. సుజిత్​ ప్లాన్​ అదేనా!

Hyderabad: డైరెక్టర్ సుజిత్ (Sujeeth) దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్​(Pawan Kalyan) హీరోగా OG చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో పవన్‌‌కు జోడీగా ప్రియాంక అరుళ్ మోహన్ (Priyanka Arul Mohan) నటిస్తోంది. ఈ చిత్ర ఫస్ట్ షెడ్యూల్ ముంబైలో పూర్తవగా.. ప్రస్తుతం మహాబలేశ్వర్‌లో జరుగుతున్నసెకండ్ షెడ్యూల్‌లో పవన్ పాల్గొంటున్నారు. ఇదిలా ఉంటే, ఈ మూవీలో పవన్ కొడుకు అకీరా నందన్ (Akira Nandan) కనిపించే అవకాశాలున్నాయనే వార్త నెట్టింట హల్​చల్​ చేస్తోంది.

OG చిత్రంలో పవన్ టీనేజర్, కాలేజ్ స్టూడెంట్, గ్యాంగ్‌స్టర్‌గా మూడు వేరియేషన్స్‌లో కనిపించనున్నారట. అయితే, 17 ఏళ్ల టీనేజ్ కుర్రాడి క్యారెక్టర్‌ను పవన్ కొడుకు అకీరా నందన్‌తో చేయించాలని డైరెక్టర్ సుజిత్ భావిస్తున్నారని టాక్. ప్రస్తుతం అకీరా చదువుకుంటుండగా.. అతని ఎంట్రీ కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. అన్నీ కుదిరితే OG చిత్రంతోనే వారి కోరిక నెరవేరే చాన్స్ ఉంది. తాజాగా నెట్టింట వైరల్​ అవుతున్న అకీరా నందన్​ ఫొటోలు ఓజీ సెట్​ నుంచి లీక్​ అయినట్లు తెలుస్తోంది. ఈ ఫొటోలో టాలీవుడ్​ హీరో, అకీరా నందన్​ స్నేహితుడు అడివి శేష్​ కూడా ఉండటంతో ఈ వార్తలకు బలం చేకూరుతోంది. మరి దీనిపై క్లారిటీ రావాలంటే అఫీషియల్​గా ప్రకటించేవరకు వెయిట్​ చెయ్యాల్సిందే.