OG: 3 వేరియేషన్స్​లో పవర్​స్టార్​?

Hyderabad: ప్రభాస్(Prabhas)​ హీరోగా సాహో(Sahoo) సినిమా తీసి పాన్​ ఇండియా డైరెక్టర్​గా క్రేజ్​ సంపాదించుకున్న దర్శకుడు సుజిత్(Sujith)​. సాహో సినిమా దేశవ్యాప్తంగా ఉన్న యాక్షన్​ ప్రేమికులని మెప్పించింది. సుజిత్​ డైరెక్షన్లో పవర్​స్టార్​ పవన్​ కల్యాణ్(Pawan Kalyan)​ సినిమా ప్రకటించినప్పటినుంచీ వీరిద్దరి కాంబోలో రాబోయే సినిమా ఎలా ఉండబోతోందా.. అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఇక ఈ సినిమాను ‘OG’ అనే వర్కింగ్ టైటిల్‌తో చిత్ర యూనిట్ రూపొందిస్తుండగా, ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరపుకుంటోంది.

ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ అనే టైటిల్‌ను ఈ సినిమాకు ఫిక్స్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కాగా, ఈ సినిమాలో పవన్ కల్యాణ్​ను ఏకంగా మూడు వైవిధ్యమైన వేరియేషన్స్‌లో చూపించేందుకు సుజిత్ ప్లాన్ చేస్తున్నాడట. అంతేకాదు పవన్​ అభిమానుల కోసం యాక్షన్​ సీక్వెన్స్​తో సినిమాలో భారీ సర్​ప్రైజ్​లు ప్లాన్​ చేస్తున్నాడట సుజిత్​.

ఓజి మూవీలో పవన్ ఓ టీనేజర్, ఒక కాలేజీ స్టూడెంట్, గ్యాంగ్‌స్టర్ పాత్రల్లో కనిపించబోతున్నాడట. ఇలా మూడు వైవిధ్యమైన లుక్స్‌లో పవన్ కనిపించనుండటంతో ఈ సినిమా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆతృతగా చూస్తున్నారు. ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తోండగా, ఆమె పాత్ర ఎలా డిజైన్ చేశారా అనే ఆసక్తి నెలకొంది. ఇక అప్పుడెప్పుడో ‘పంజా’ మూవీలో గ్యాంగ్‌స్టర్‌గా కనిపించిన పవన్, ఇన్నాళ్ల తరువాత మరోసారి డాన్ లుక్‌లో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యాడు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా, డివివి దానయ్య ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.