Vikram: హీరో విక్ర‌మ్‌కు తీవ్ర‌గాయం..స‌ర్జ‌రీ చేయాల‌న్న వైద్యులు

Chennai: ప్ర‌ముఖ న‌టుడు విక్ర‌మ్(virkam) తీవ్రంగా గాయ‌పడ్డారు. ఆయ‌న న‌టిస్తున్న‌ తంగలాన్(thagalaan) సినిమా షూటింగ్ స‌మ‌యంలో ప్రమాదం జ‌రిగింది. దాంతో వెంట‌నే ద‌గ్గ‌ర్లోని హాస్పిటల్‌కు త‌ర‌లించారు. ఆయ‌న ప‌క్క‌టెముక విరగ‌డంతో వెంట‌నే స‌ర్జ‌రీ చేయాల‌ని వైద్యులు చెప్పిన‌ట్లు తెలుస్తోంది. మొన్న‌టి వ‌ర‌కు పొన్నియిన్ సెల్వన్-2 ప్రమోషన్స్ లో ఉన్న విక్రమ్ నిన్ననే తంగలాన్ షూటింగ్‌లో జాయిన్ అయ్యారు. చెన్నైలోని ఈపీవి ఫిలిం సిటీలో తంగలాన్ షూటింగ్ జరుగుతుంది. నేడు ఉదయం కొన్ని యాక్షన్ సీన్స్ తీస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది.