Karnataka elections: మామిడి చెట్టులో కోటి రూపాయలు!
Karnataka: డబ్బులేమన్నా చెట్లకు కాస్తాయా..అని అంటుంటారు. కానీ త్వరలో ఎన్నికలు జరగబోయే కర్ణాటక రాష్ట్రంలో(karnataka elections) నిజంగానే డబ్బు చెట్లకు కాసింది. అదేంటి అనుకుంటున్నారా? ఏమీ లేదండి.. ఓ పొలిటిషియన్ తన ఇంట్లోని మామిడి చెట్టు కింద కోటి రూపాయలు దాచుకుని దొరికిపోయాడు. మైసూరు(mysore)కు చెందిన సుబ్రహ్మణ్య రాయ్(subramania rai) అనే వ్యక్తి నివాసంలో ఐటీ అధికారులు మామిడి చెట్టుకి వస్త్రాలు కప్పి దాచి ఉంచిన కోటి రూపాయల నగదును సీజ్ చేసారు. సుబ్రహ్మణ్య రాయ్.. పుత్తూరుకు చెందిన కాంగ్రెస్ అభ్యర్ధి అశోక్ కుమార్ రాయ్ సోదరుడు. ఎన్నికల(karnataka elections) నేపథ్యంలో ఐటీ అధికారులు కర్ణాటకలోని పలు ప్రాంతాలను జల్లెడపడుతున్నారు. మరోపక్క ఓ ఆటో రిక్షాలో భారీగా నగదు తరలిస్తున్నట్లు సమాచారం రావడంతో డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు.