Upasana: రామ్ భార్యకు భీమ్ వైఫ్ కానుక!
Hyderabad: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(ram charan) భార్య ఉపాసన(upasana) త్వరలో బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. వివాహం అయిన పదేళ్ల తర్వాత వారు తమకంటూ ఓ వారసుడో లేదా వారసురాలో కావాలని నిర్ణయించుకోవడంతో మెగా కుటుంబంలో(mega family) ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. ఇటీవల ఘనంగా ఉపాసనకు(upasana) శ్రీమంతం కూడా చేసారు. అయితే.. ఉపాసనకు.. జూనియర్ ఎన్టీఆర్(jr ntr) భార్య ప్రణతి(pranathi) ఓ గిఫ్ట్ పంపారట. డ్రై ఫ్రూట్స్‌తో తయారుచేసిన ఆర్గానిక్ స్వీట్ బాక్స్‌ను ఉపాసనకు పంపారు. ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు ఫుడ్ క్రేవింగ్స్ ఎక్కువగా ఉంటాయి. అలాంటి సమయంలో నచ్చినది తినలేరు కాబట్టి ప్రణతి బాగా ఆలోచించి ఆ స్వీట్ బాక్స్ పంపినట్లున్నారు. RRR సినిమాలో రామ్, భీమ్‌గా తమ బాండ్‌తో మెస్మరైజ్ చేసిన తారక్, చరణ్.. ఆఫ్ స్క్రీన్‌లోనూ జిగ్రీ దోస్తులన్న విషయం తెలిసిందే.