Chatrapathi: పాకిస్థానీ ఇండియాలో హీరోనా?

Hyderabad: దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli) డైరెక్షన్లో యంగ్​ రెబల్​ స్టార్​ ప్రభాస్(Prabhas) హీరోగా వచ్చిన మొదటి సినిమా ఛత్రపతి(Chatrapathi). ఈ సినిమా రికార్డులు తిరగరాసి బ్లాక్ బస్టర్ హిట్​గా నిలిచిన సంగతి తెలిసిందే. 2005లో వచ్చిన ఛత్రపతి సినిమా అప్పట్లో ఓ సంచలనం. ఈ సినిమాను 18 ఏళ్ళ తర్వాత  హిందీలో(Hindi) రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. బెల్లంకొండ శ్రీనివాస్(Bellamkonda Srinivas) హీరోగా, VV వినాయక్(VV Vinayak) దర్శకత్వంలో హిందీలో ఛత్రపతి పేరుతోనే రీమేక్ చేస్తున్నారు. ఇందులో నుశ్రుత్ భరూచా(Nushrratt Bharuccha) హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

తాజాగా హిందీ ఛత్రపతి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్​. ప్రభాస్​ని మరిపించేలా బెల్లంకొండ శ్రీనివాస్ మేకోవర్​ అభిమానులను ఆకట్టుకోవడంతో  ఈ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. కానీ, కొందరు మాత్రం ఈ ట్రైలర్​పై ఫైర్​ అవుతున్నారు. దర్శకుడు VV వినాయక్ పై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. ఒరిజినల్ ఛత్రపతి సినిమాలో హీరో, అతని చుట్టూ ఉండే జనాలు శ్రీలంక నుంచి ఇండియాకు వచ్చి బతుకుతున్నట్టు చూపించారు. అయితే వాళ్ళు కూడా ఇండియన్స్ అనే చూపించారు.

తాజాగా రిలీజైన హిందీ ట్రైలర్ లో హీరో, అతని పక్కన ఉండే జనాలు అంతా పాకిస్థాన్ నుంచి వచ్చినట్టు చూపించారు. అయితే స్వాతంత్య్రం ముందు అయితే అంతా ఇండియానే.. అటు, ఇటు జనాలు చాలా మంది మారారు అనుకోవచ్చు. కానీ 1985లో పాకిస్థాన్ నుంచి హీరో, అతని చుట్టూ ఉండే ఆ జనాలు ఇండియాకు వచ్చినట్టు చూపించారు. దీంతో పలువురు నెటిజన్లు ఈ విషయంలో దర్శకుడిని విమర్శిస్తున్నారు. పాకిస్థాన్ నుంచి వచ్చిన వాడ్ని ఇక్కడ ఎలా హీరోని చేస్తావు? అని ఫైర్ అవుతున్నారు. మరి ఈ వివాదం సినిమా ఫలితంపై ఏవిధంగా ప్రభావం చూపుతుందో చూడాలి!