పేషంట్ చనిపోయాడని తెలీక.. ఓ డాక్టర్ ఎమోషనల్ స్టోరీ
Hyderabad: తన పేషెంట్(patient) చనిపోయాడని తెలీక.. అతని లడ్డూ(laddoo) కోసం ఎదురుచూస్తుండిపోయిన ఓ డాక్టర్(doctor) ఎమోషనల్ స్టోరీ(emotional story) ఇది. ఓ డాక్టర్ తన ట్విటర్లో షేర్ చేసిన ఈ స్టోరీ ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ట్విటర్లో ఆ డాక్టర్ పేరు లివర్ డాక్టర్ అని ఉంది. పాల్ అనే పేషంట్ ఆల్కహాల్ డిజార్డర్‌తో తన వద్దకు ట్రీట్మెంట్కి వచ్చేవాడట. పదిహేనేళ్లుగా విపరీతంగా తాగుడికి బానిస అవడంతో అతని లివర్ చెడిపోయింది. దాంతో ఆ డాక్టర్ లివర్ మార్పిడి చేయాలని చెప్పాడు. బేకరీ నడుపుకుంటూ భార్య, ఇద్దరు పిల్లల్ని పోషిస్తున్న అతని వద్ద డబ్బుల్లేవు. దాంతో సర్జరీ చేయించుకోలేకపోయాడు. యాంటీబయోటిక్స్‌తో ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉండేవాడు. ఆ తర్వాత చెకప్‌లకు మందులకు డబ్బులు లేక ఆ పేషంట్ రావడం మానేసాడు. దాంతో పెద్ద మనసుతో ఆ డాక్టర్ ఫోన్ ద్వారా జాగ్రత్తలు చెప్పేవాడట. ఆ పేషంట్‌కు ఒక భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
అయితే ఓ సారి తన వద్దకు ఆ పేషెంట్ భార్యా పిల్లలు వచ్చి మూడు లడ్డూలు ఇచ్చి వెళ్లారట. అందులో ఒక లడ్డు పేషెంట్ భార్యది, మరో రెండు లడ్డూలు పిల్లలవి. మరి ఆ పేషెంట్ నుంచి నాలుగో లడ్డూ రాలేదేంటబ్బా అని అతని కోసం ఎదురుచూస్తుండిపోయాడట. కానీ ఆల్కహాల్ డిజార్డర్ కారణంగా లివర్ మార్పిడి చేసినా ఫలితం లేకుండాపోవడంతో అతను చనిపోయాడని తెలిసింది. దాంతో ఎంతో బధపడిన ఆ డాక్టర్.. దయచేసి తాగుడికి బానిస కావొద్దూ అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. ది ఫోర్త్ లడ్డూ అనే పేరుతో ఈ స్టోరీని ట్విటర్లో షేర్ చేసారు.