Neera cafe ప్రత్యేకతల.. ఒక్కసారి తాగితే వదిలిపెట్టరు!
Hyderabad:: హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్(hussain sagar) తీరంలో నీరా కేఫ్(neera cafe)ను బుధవారం మంత్రి కేటీఆర్(minister ktr) ప్రారంభించనున్నారు. ఈ కేఫ్‌ను తెలంగాణ ప్రభుత్వం(telangana govt) ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. దాదాపు రెండేళ్ల పాటు శ్రమించి.. 20 కోట్ల రూపాయల వ్యయంతో దీన్ని నిర్మించారు. ఇక్కడ ప్రత్యేకంగా లభించే డ్రింక్ పేరు నీరా.. ఇది ఆల్కాహాల్ కాదని.. ఇందులో ఆరోగ్యకరమైన పదార్థాలతో తయారు చేస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. అయితే.. కేఫ్ చుట్టూ.. తాటి చెట్లతో.. చూడటానికి కల్లు కాంపౌండ్ లాగా కనిపిస్తున్నా.. ఇక్కడ ఎలాంటి కల్లు, ఆల్కాహాల్ కనిపించదని.. కేవలం తెలంగాణ కల్చర్‌ను రిప్రజెంట్ చేయడమే తమ ఉద్దేశమని అంటున్నారు.
హుస్సేన్ సాగర్ తీరాన ఉన్న నీరా కేఫ్‌ను ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంచనున్నారు. ఇక్కడ నీరాతోపాటు, నీరా బూస్టు, షుగర్, హనీ, ఐస్‌క్రీమ్‌లు కూడా అందుబాటులో ఉండనున్నాయి. వీటితోపాటు.. రెస్టారెంట్ ఫుడ్ ఐటమ్స్‌తో కొన్ని స్టాల్స్‌ను ఏర్పాటు చేశారు. ఇక్కడ చికెన్, మటన్ ఐటమ్స్ లభించనున్నాయి. నీరా కేఫ్ ప్రత్యేకతల గురించి.. మంత్రి శ్రీనివాస్ గౌడ్(minister srinivas goud) మాట్లాడుతూ.. సాధారణంగా నీరా అనగానే ఆల్కాహాల్ డ్రింక్ అనుకుంటారని.. కానీ అలాంటిది కాదని.. ఇక కల్లులో అనేక రకాలు ఉంటాయని అన్నారు. నీరాలో మాత్రం వైవిధ్యం ఉందన్నారు. నీరా షుగర్.. మధుమేహం వారికి ఉపయోగపడుతుందని.. అందులో ఉండే.. అమైనో యాసిడ్స్, ఇతర పదార్థాలు.. క్యాన్సర్, ఇతర అనారోగ్య సమస్యలు రాకుండా చూస్తుందన్నారు. సైంటిఫిక్ పరీక్షలు చేసిన తర్వాతే నీరాను ప్రజలకు అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. రోగనిరోధక శక్తిని కూడా నీరా పెంపొందిస్తుందని చెబుతున్నారు.