karnataka elections: BJP ఎదురీత.. చేయందిస్తున్న కాంగ్రెస్‌!

bengaluru: కర్నాటక ఎన్నికల్లో(karnataka elections) బీజేపీ(bjp)కి ఎదురీత తప్పేలా లేదు. ఇప్పటికే మెజార్టీ సర్వే సంస్థలు అన్నీ,,, కాంగ్రెస్‌(congress) పార్టీ అధికారం దక్కించుకుంటుందని చెబుతున్నాయి. అయితే.. బీజేపీ(bjp), కాంగ్రెస్‌(congress)కు మధ్య సీట్ల విషయంలో పెద్దగా డిఫరెన్స్‌ ఏమీ ఉండదని.. నెక్ టు నెక్‌ వస్తాయని సర్వే సంస్థలు చెబుతున్నాయి. ఇక కర్నాటకలో అధికార బీజేపీకి ఓటర్లు మద్దతు తెలపకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ప్రధానంగా బీజేపీ ఎమ్మెల్యేలు పెద్దఎత్తున అవినీతికి పాల్పడటం, రాష్ట్రంలో చెప్పుకోదగ్గ అభివృద్ది జరగకపోవడం, నిరుద్యోగ సమస్యలు.. మరికొన్ని కారణాలు ఉన్నాయి. ఇక ఇదే విషయాన్ని ప్రజలకు చెబుతూ.. కాంగ్రెస్‌, జేడీఎస్‌ పార్టీలు ప్రచారం నిర్వహిస్తుండగా.. బీజేపీ మాత్రం హిందుత్వం, రిజర్వేషన్ల అంశంతో ఓట్లు రాబట్టుకోవాలని చూస్తోంది. ప్రధానంగా హిందూ, ముస్లింల మధ్య గ్యాప్‌ తీసుకొచ్చే ప్రయత్నం బీజేపీ చేస్తోంది.

వాస్తవానికి కర్నాటకలో(karnataka elections) ఒకసారి గెలుపొందిన పార్టీని మరోసారి అక్కడి ప్రజలు ఎన్నుకోరు. ఇది సంప్రదాయంగా వస్తోంది. ఈ లెక్కన కాంగ్రెస్‌ పార్టీ సునాయసంగా గెలుపొందే అవకాశాలు ఉన్నాయి. బీజేపీ కూడా ప్రయోగాత్మకంగా ఎన్నికలకు వెళ్తోంది. ఇప్పటికే అనేక మందికి కొత్తవారికి ఆ పార్టీ సీట్లు కేటాయించింది. అయితే.. ఇదే క్రమంలో కాంగ్రెస్‌ నాయకుల వ్యాఖ్యలు.. బీజేపీ గెలుపునకు ఆజ్యం పోసేలా ఉన్నాయి. ఇటీవల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు ఖర్గే.. బీజేపీని విషసర్పంతో పోల్చారు. దీన్ని బీజేపీ అనుకూలంగా మార్చుకుని మోదీని అన్నట్లుగా ప్రచారం చేశాయి. తద్వారా మోదీ సెంటిమెంట్‌ను ఎన్నికల్లోకి తీసుకొచ్చాయి. ఇక తాజాగా… హిందువుల స్టూడెంట్‌ వింగ్‌ భజరంగ్‌దళ్‌ను కాంగ్రెస్‌ పార్టీ బ్యాన్‌ చేస్తాననడం పెద్దదుమారం రేపుతోంది. బీజేపీ ఈ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళుతోంది. మోదీ కూడా కాంగ్రెస్‌ పార్టీ హిందువుల వ్యతిరేకి అంటూ… విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్‌ భజరంగ్‌ దళ్‌ను బ్యాన్‌ చేస్తానంటూ… ఆంజనేయ స్వామిని అవమానిస్తోందని బీజేపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. ఇలా బీజేపీకి కాంగ్రెస్‌ పార్టీ పరోక్షంగా అవకాశం ఇస్తోంది.