Shahrukh కొడుకు దుస్తుల కంపెనీ.. ధరలు చూసి షాకైన జనాలు
Mumbai: బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుక్ ఖాన్(shahrukh khan) కొడుకు ఆర్యన్ ఖాన్(aryan khan) దుస్తుల బ్రాండ్ ప్రారంభించాడు. D’YAVOL X అనే పేరుతో దుస్తులను మార్కెట్‌లోకి తీసుకొచ్చాడు. దీని కోసం తన తండ్రితో దిగిన ఫొటోలు పోస్ట్ చేసి మార్కెటింగ్ చేసాడు. అయితే ఆ దుస్తుల రేట్లు చూసి జనాలు షాక్ అయ్యారు. ఒక్కో జాకెట్ ధర 25 నుంచి 40 వేల వరకు ఉందట. ఇక షారుక్ ఖాన్(shahrukh khan) సంతకం ఉన్న జాకెట్ ధర అయితే రూ.2 లక్షలు. దాంతో అంత డబ్బు పెట్టి కొనలేం కానీ కిడ్నీ అమ్మితే తీసుకుంటారా అంటూ నెటిజన్లు తెగ కామెంట్లు చేసారు. అయితే ఒక్కరోజులోనే మార్కెట్‌లో రిలీజ్ అయిన కొన్ని దుస్తులు అన్నీ అమ్ముడుపోయాయని ఆర్యన్ ప్రకటించడం వైరల్‌గా మారింది. ఇకపోతే..ఆర్యన్ కూడా త్వరలో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అయితే హీరోగా మాత్రం కాదు. తనకు రైటర్‌గా, డైరెక్టర్‌గా ప్రయత్నించాలని ఉందని తెలిపాడు.