Kcr వద్ద అవినీతి ఎమ్మెల్యేల చిట్టా… వేటు తప్పదా?
hyderabad: తెలంగాణ సీఎం కేసీఆర్(telangana cm kcr).. ఇటీవల జరిగిన బీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావ(brs party formation day) సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన దళితబంధు(dalitha bandhu), డబుల్ బెడ్‌రూం(double bedroom houses scheme) ఇళ్ల పథకాల్లో అవినీతికి పాల్పడినట్లు తేలిందని కేసీఆర్ మాట్లాడటం తీవ్ర దుమారం రేపింది. అయితే వారిపై ఇప్పుడే చర్యలు ఉండవని చెప్పినా.. పరోక్షంగా రానున్న ఎన్నికల్లో సీటు ఇస్తారో లేదో ఆయన క్లారిటీ ఇవ్వలేదు. దీంతో దాదాపు బీఆర్‌ఎస్‌కు చెందిన 30 మంది ఎమ్మెల్యేల్లో ఆందోళన మొదలైనట్లు సమాచారం.
మరోవైపు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, కీలక నేతలను ఆకర్షించే పనిలో బీజేపీ(bjp), కాంగ్రెస్(congress) నాయకులు ఉన్నారు. అందులో ఓ అడుగు ముందు వరుసలో బీజేపీ ఉంది. ఆ పార్టీ ఏకంగా చేరికల కమిటీ అనే పేరుతో ఓ కమిటీని ఏర్పాటు చేసి.. బీఆర్‌ఎస్ నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్న ఎమ్మెల్యే ఈటల రాజేందర్(bjp mla etela rajendar)కు బాధ్యతలను అప్పగించింది. దీనిపై హోంమంత్రి అమిత్ షా(amit sha) ఎప్పిటికప్పుడు సమాచారం తెప్పించుకుంటున్నారు. అయితే.. ఇలాంటి పరిస్థితుల్లో కూడా కేసీఆర్ ఎమ్మెల్యేలపై వేటు తప్పదు అనే నిర్ణయం ప్రకటించడం.. కొంత ఇబ్బందికరమే. కానీ.. ప్రజల్లో బీఆర్‌ఎస్‌పై ఉన్న అవినీతి మచ్చను కేసీఆర్ కడిగేసేందుకు ఆయనకు మరో మార్గం లేదు.
ఒకవేళ అవినీతి, గ్రూపు రాజకీయాలు, సరిగ్గా పనిచేయని ఎమ్మెల్యేలపై కేసీఆర్ వేటు వేస్తే.. అదే విషయాన్ని సీఎం ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లవచ్చు. ఒకవేళ వారు ఇతర పార్టీల్లో చేరినా.. తాము అవినీతి పరులు అని చెప్పి పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వారిని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు చేర్చుకున్నాయని సీఎం కేసీఆర్ ఆరోపించొచ్చు. ఇక కేసీఆర్ నిర్ణయం చూస్తే మాత్రం.. రానున్న ఎన్నికలు ఎంత రసవత్తరంగా ఉంటాయో అర్థం అవుతోంది.