OG: ఫ్యాన్స్​కి వాల్​పేపర్​ దొరికినట్టే!

Hyderabad: పవర్​ స్టార్​ పవన్​ కల్యాణ్(Pawan Kalyan) వరుస సినిమాలు, రాజకీయాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఓకే సమయంలో నాలుగైదు ప్రాజెక్టులను లైన్లో పెట్టిన పవన్​ ఒక్కో ప్రాజెక్ట్​ పూర్తి చేసే పనిలో ఉన్నారు. తాజాగా సముద్రఖని(Samuthirakani) దర్శకత్వంలో రూపొందుతున్న వినోదయా సిత్తం(Vinodhaya Sitam) తెలుగు రీమేక్​ షూటింగ్​ పూర్తి చేసిన పవన్​ వెంటనే సుజిత్​ డైరెక్షన్లో రూపొందుతున్న ఓజీ(OG) షూటింగ్​లో జాయిన్​ అయ్యారు. డైరెక్టర్​ క్రిష్ జాగర్లమూడి(Krish)​ దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడికల్​ మూవీ హరిహర వీరమల్లు(Harihara Veeramallu) షూటింగ్​ని కూడా పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఇక సెట్​ పవన్​ కల్యాణ్​ ఏ ఫొటో బయటకు వచ్చినా ఫ్యాన్స్​కి పండగే. పవన్​కి ఉండే ఫ్యాన్​ ఫాలోయింగ్​ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే పవన్​ ఫొటో బయటకు వచ్చిందంటే చాలు.. క్షణాల్లో ​వైరల్​ అవుతుంది. తాజాగా ఓజీ షూటింగ్​ నుంచి బయటకు వచ్చిన ఫొటోలో పవన్​ లుక్​ అభిమానులను ఆకట్టుకుంటోంది. యంగ్​ అండ్​ ఎనర్జిటిక్​గా బ్లూ టీషర్ట్​, కూలింగ్​ గ్లాసెస్​తో రాయల్​ లుక్​లో ఉన్న ఈ ఫొటో చూసిన నెటిజన్లు ‘ఫ్యాన్స్​కి పండగే.. కొత్త వాల్​పేపర్​ దొరికింది’ అంటూ సంబరపడిపోతున్నారు.

ఇక పవన్, హరీష్​ శంకర్(Harish Shankar)​ కాంబినేషన్లో రానున్న ఉస్తాద్​ భగత్​ సింగ్(Ustaad Bhagat Singh)​ షూటింగ్​ కూడా శరవేగంగా కొనసాగుతోంది. ఈ సినిమా నుంచి అప్​డేట్స్​ ఇచ్చేందుకు భారీ కసరత్తులు చేస్తున్నారు హరీష్. గబ్బర్​సింగ్​ తర్వాత వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమా కావడంతో అటు ప్రేక్షకుల్లోనూ ఇటు సినీ వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది.​