Gas Leak Incident: తల్లిదండ్రులకు కొరివి పెట్టిన పసికందు
Ludhiana: పంజాబ్(punjab)లో ఇటీవల ఓ ఫ్యాక్టరీ నుంచి గ్యాస్ లీకై(gas leak incident) దాదాపు 13 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ దారుణ ఘటనలో 8 నెలల పసికందు తల్లిదండ్రులు కూడా ఉన్నారు. తల్లి ఒడిలో వెచ్చగా నిద్రపోవాల్సిన ఆ చిట్టితండ్రి తనకు తెలీకుండానే అమ్మానాన్నలకు కొరివి పెట్టాల్సి వచ్చింది. లుధియానాకు(ludhiana) చెందిన సౌరవ్ గోయల్, ప్రీతి దంపతులకు యుగ్ అనే 8 నెలల కుమారుడు ఉన్నాడు. గ్యాస్ లీక్ అయిన సమయంలో సౌరవ్, ప్రీతి, సౌరవ్ తల్లి బయటికి వెళ్లారు. దాంతో వారిపై ఆ గ్యాస్ విపరీతంగా ప్రభావం చూపింది. ఊపిరాడక అక్కడికక్కడే స్పృహకోల్పోయి చనిపోయారు. యుగ్ ఇంట్లోనే ఉండటంతో ఆ చిన్నారికి ఫీవర్ వచ్చింది. విషయం తెలీడంతో కుటుంబీకులు వెంటనే లుధియానాకు చేరుకున్నారు. ముగ్గురికీ అంత్యక్రియలు జరిగే సమయంలో యుగ్ చెయ్యి పట్టుకుని సౌరవ్ చెల్లెలు కొరివికి నిప్పు పెట్టించింది. దాంతో అక్కడున్నవారంతా కన్నీరుమున్నీరయ్యారు. తల్లిదండ్రులు తిరిగి రారు అని తెలీక ఆ చిన్నారి తన అత్తను పట్టుకుని ఏడ్వటం అక్కడున్నవారి హృదయాలను కలచివేసింది.