movies in may: ఈ నెలలో రిలీజ్‌కి రెడీ!

Hyderabad: వేసవి సెలవులు(Summer Holidays) మొదలయ్యాయి. దీంతో బాక్సాఫీస్(Box Office) వద్ద సందడి చేయడానికి సినిమాలు కూడా రెడీ అవుతున్నాయి. చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అనే తేడా లేకుండా మే(May) నెలలో ఏకంగా 14 సినిమాలు విడుదల కానున్నాయి. ఆ జాబితా ఏంటో చూద్దాం.
రామబాణం
గోపీచంద్ హీరోగా డింపుల్ హయాతి హీరోయిన్‌గా నటిస్తున్న సినిమా రామబాణం(Ramabanam). పక్కా ఫ్యామిలీ ఎంటర్‌‌టైనర్‌‌గా తెరకెక్కిన ఈ సినిమా మే 5వ తేదీన విడుదల కానుంది.
ఉగ్రం
అల్లరి నరేష్‌ రొటీన్కి భిన్నంగా‌ చేస్తున్న సినిమా ఉగ్రం(Ugram). విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు తూమ్ వెంకట్ కథ అందించారు. మిర్నా మీనన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా మే 5వ తేదీన విడుదల కానుంది.
కస్టడీ
నాగచైతన్య హీరోగా నటించిన సినిమా కస్టడీ(Custody). కృతి శెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో అరవింద్ స్వామి, శరత్ కుమార్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా మే 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి
అనుష్క శెట్టి, యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. పి.మహేష్‌బాబు దర్శకత్వంలో రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌‌టైనర్‌‌గా తెరకెక్కిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్‌‌పై వంశీ, ప్రమోద్ నిర్మించారు. ఈ సినిమా మే 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

ఇవి కాకుండా మే 5వ తేదీన గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వి3, మే12వ తేదీన ఫర్హానా, బిచ్చగాడు2, మ్యూజిక్ స్కూల్, భువన విజయం, మే 18న అన్నీ మంచి శకునములే, సామజవరగమన, మే 19న టక్కర్, ఇక మెన్‌ టూ, రుద్రాంగి సినిమాలు మే 26వ తేదీన విడుదల కానున్నాయి. మొత్తానికి మే నెలలో బాక్సాఫీస్ వద్ద కొత్త సినిమాల సందడి బాగానే ఉంది.