Kangana Ranaut : సేమ్ సెక్స్ మ్యారేజ్‌లో త‌ప్పేముంది?

Hyderabad: బాలీవుడ్(Bollywood) ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్(Kangana Ranaut) ఏం మాట్లాడినా సంచలనమే. బాలీవుడ్ సినిమా మాఫియాపై విమర్శలు చేస్తూ, సోషల్ మీడియా(Social Media)లోనూ ఓపెన్​ స్టేట్​మెంట్స్​ ఇస్తూ అనునిత్యం వార్తల్లో నిలుస్తుంది కంగన. తాజాగా కంగనా రనౌత్ స్వలింగ సంపర్క వివాహంపై చేసిన వ్యాఖ్యలు వైరల్​గా మారాయి.

కొంతలకాలంగా స్వలింగ సంపర్క వివాహానికి చట్టబద్దత కలిపించాలని LGBTQ సమూహానికి చెందిన వ్యక్తులు కోరుతున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి సుప్రీం కోర్టులో కేసు నడుస్తుంది. అయితే ఇది ప్రభుత్వం ఒప్పుకోకుండా తాము సొంత నిర్ణయాలు తీసుకోలేమని, మతానికి సంబంధించినవి కాబట్టి ప్రభుత్వ వాదనలు కూడా ఉండాలని న్యాయమూర్తులు అనడంతో కొన్ని రోజులుగా స్వలింగ సంపర్క వివాహానికి సంబంధించి కేసు వాయిదా పడుతూ వస్తుంది.

తాజాగా స్వలింగ సంపర్క వివాహంపై బాలీవుడ్ భామ కంగనా రనౌత్ కామెంట్స్ చేసింది. హరిద్వార్ లో గంగా పుష్కరాలలో పాల్గొన్న కంగనా మీడియాతో మాట్లాడింది. ఈ నేపథ్యంలో పలు అంశాల గురించి మాట్లాడగా మీడియా ప్రతినిధులు స్వలింగ సంపర్క వివాహం గురించి అడగగా కంగనా రనౌత్ దీని గురించి మాట్లాడుతూ.. పెళ్లి అనేది ప్రేమ, హృదయానికి సంబంధించిన విషయం. రెండు హృదయాలు కలిసినప్పుడు అవి ఎవరైతే ఏంటి, మనం ఏం చెప్పగలం అని మాట్లాడుతూ స్వలింగ సంపర్క వివాహానికి మద్దతు తెలిపింది.

దీనిపై పలువురు LGBTQ సమూహానికి చెందిన వ్యక్తులు సంతోషం వ్యక్తం చేస్తూ కంగనాకు సపోర్ట్ గా కామెంట్స్ చేస్తున్నారు. పలువురు కంగనా మాట్లాడిన వీడియోని షేర్ చేస్తూ.. ‘ఏ బాలీవుడ్ నటులు మాట్లాడలేని టాపిక్ ని ధైర్యంగా మాట్లాడింది కంగనా’ అంటూ అభినందిస్తున్నారు.