Roja: తెర వెన‌కా గొప్ప న‌టుడు..!

Hyderabad: సినీ న‌టుడు ర‌జినీకాంత్(rajinikanth) తెర మీదే కాదు తెర వెన‌కా మంచి న‌టుడు అని ఎద్దేవాచేసారు వైసీపీ నేత రోజా(roja). దివంగ‌త న‌టుడు ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతి ఉత్స‌వాల స‌మ‌యంలో సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్.. ఏపీ మాజీ సీఎం చంద్ర‌బాబుని పొగుడ్తూ మాట్లాడ‌టంతో వైసీపీ నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ర‌జినీకాంత్ ఏ ముఖం పెట్టుకుని ఏపీ వ‌చ్చారంటూ అస‌భ్య‌క‌రమైన కామెంట్స్ చేసారు. దాంతో ర‌జినీకి వైసీపీ నేత‌లు సారీ చెప్పాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ఓ గొప్ప వ్య‌క్తిని వ‌య‌సులో పెద్ద‌వారు అని కూడా చూడ‌కుండా నోటికొచ్చిన‌ట్లు మాట్లాడినందుకు సారీ చెప్పాల్సిందేన‌ని చంద్ర‌బాబు ట్వీట్ చేసారు. ఈ ట్వీట్‌కు రోజా స్పందిస్తూ.. “ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతి ఉత్స‌వాల్లో ఆయ‌న్ని యుగ‌పురుషుడ‌ని కొనియాడిన ర‌జినీకాంత్ అదే ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడ‌వ‌డంలో చంద్ర‌బాబు ఎందుకు స‌హ‌క‌రించాడు? అప్పుడు అంతా చేసి ఇప్పుడు పొగ‌డడం చూస్తుంటే ఈయ‌న తెర‌మీదే కాదు తెర వెనుక కూడా గొప్ప‌న‌టుడు అనిపిస్తోంది” అని కామెంట్ చేసారు.