Mosagallaku Mosagadu: 52 ఏళ్ల తర్వాత రీరిలీజ్​!

Hyderabad: టాలీవుడ్‌లో ప్రస్తుతం రీరిలీజ్ ట్రెండ్​ కొనసాగుతోంది. సందర్భానుసారం స్టార్ హీరోల హిట్​ సినిమాలను రీరిలీజ్ చేస్తూ అభిమానులను సర్​ప్రైజ్​ చేస్తున్నారు మేకర్స్. ఇక ఈ క్రమంలో రీరిలీజ్​ అయిన పోకిరి(Pokiri), జల్సా(Jalsa), ఆరెంజ్(Orange) వంటి సినిమాలకు ప్రేక్షకుల నుంచి అశేష ఆదరణ లభించింది. కాగా, ఇప్పుడు మరో సినిమాను రీరిలీజ్ చేసేందుకు ఏర్పాటు చేస్తున్నారు.

ఇండియన్ సినీ చరిత్రలో ఫస్ట్ కౌబాయ్ మూవీగా వచ్చిన ‘మోసగాళ్లకు మోసగాడు’(Mosagallaku Mosagadu) ఒక ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో లెజెండరీ యాక్టర్ కృష్ణ(Superstar Krishna) నటించగా, ఈ చిత్రాన్ని KSR దాస్ డైరెక్ట్ చేశారు. ఈ చిత్రం అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. కాగా, ఈ సినిమాను రీరిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్​ చేస్తున్నారు. సూపర్​స్టార్​ కృష్ణ జయంతి సందర్భంగా ఈ సినిమాను మే 31న రిలీజ్ చేస్తున్నట్లు అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.

ఇండియన్ సినిమాకు 70 ఎంఎం, సినిమాస్కోప్, ఈస్ట్‌మెన్ కలర్, DTS, TFI వంటి కొత్త టెక్నాలజీలను పరిచయం చేసిన కృష్ణ, తొలి కౌబాయ్ మూవీని కూడా పట్టుకొచ్చారు. ఈ సినిమాను 4K వర్షన్‌లో రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. 1971లో రిలీజైన ఈ సినిమా దాదాపు 52 ఏళ్ల తర్వాత మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది.