Shriya Saran: ఆ ప్రశ్న హీరోలను అడుగుతారా?
Hyderabad: ఇష్టం సినిమాతో టాలీవుడ్ (Tollywood)లోకి అడుగుపెట్టిన హీరోయిన్ శ్రియా శరణ్ (Shriya Saran). పెళ్లి చేసుకుని ఓ బిడ్డకి తల్లి అయినా అందంలో ఏమాత్రం తగ్గకుండా ఈతరం హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తోంది ఈ భామ. అంతేకాదు సోషల్ మీడియాలో హాట్ ఫోటోలు షేర్ చేస్తోంది. ఈ హాట్ బ్యూటీ మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) నటిస్తున్న భోళా శంకర్(Bhola shankar) సినిమాలో ఓ ప్రత్యేక గీతంలో కనపడనుందని సమాచారం. తాజాగా ఒక ఇంటర్వ్యూలో రిపోర్టర్ అడిగిన ప్రశ్నపై ఆమె అసహనం వ్యక్తం చేసింది శ్రియ. తన అందం గురించి ఓ రిపోర్టర్ చేసిన కామెంట్ ఆమెకు కోపం తెప్పించింది. దానికి సమాధానంగా హీరోలను టార్గెట్ చేస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
పెళ్లయిన తర్వాత కూడా ఇంత అందంగా ఉండడానికి కారణం ఏమిటి? అని విలేకరి అడిగాడు. దీనికి శ్రియ స్పందిస్తూ.. ‘హీరోయిన్లను మాత్రమే ఎందుకు ఇలాంటి ప్రశ్నలు వేస్తారు? హీరోలను అడిగే ధైర్యం ఉందా? నా అందాన్ని చూసి నా స్నేహితులు మెచ్చుకుంటారు. పెళ్లయి పిల్లలు పుట్టాక కూడా నువ్వు చాలా అందంగా ఉన్నావు అని పొగిడేస్తారు. ఇక్కడ అందం ఒక్కటే ముఖ్యం కాదు వయసు? ఇండస్ట్రీకి వచ్చి ఎంతకాలం అయ్యింది? ఇలాంటివి ప్రశ్నలు హీరోలను అడిగే ధైర్యం మీకు లేదు’ అని ఫైర్ అయ్యారు శ్రియ.
2018లో శ్రియ –ఆండ్రూ బంధువులు, సన్నిహితుల మధ్య పెళ్లి చేసుకున్నారు. లాక్ డౌన్ సమయంలో గర్భం దాల్చిన శ్రియ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కూతురు పేరు రాధ. చాలా కాలం తర్వాత ఈ విషయాన్ని అభిమానులతో పంచుకుంది శ్రియ. బాడీ షేమింగ్‌కు గురికావాల్సి వస్తుందేమోననే ఆందోళనతో తాను గర్భం దాల్చిన విషయాన్ని చెప్పలేదని తెలిపింది.