Bhola Shankar: మే డే స్పెషల్​ పోస్టర్​ రిలీజ్​!

Hyderabad: ‘ఖైదీ నెంబర్‌150’తో అదిరిపోయే రీ ఎంట్రీ ఇచ్చారు మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi). ఆ తర్వాత చిరు నటించిన ‘సైరా’, ఆచార్య (Acharya) సినిమాలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఫ్లాప్‌ ఎరుగని దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించడంతో ఆచార్య సినిమాపై పెట్టుకున్న అంచనాలు కూడా దెబ్బతిన్నాయి. అనంతరం చిరంజీవి నటించిన గాడ్‌ఫాదర్ సినిమా అభిమానులను అలరించింది. దసరా కానుకగా విడుదలైన గాడ్ ఫాదర్ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది.

ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) సినిమాతో చిరంజీవి మరోసారి బ్లాక్ బస్టర్ హిట్‌ అందుకున్నారు. చిరంజీవితో మాస్‌ మహారాజా రవితేజ నటించిన ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లకు దాదాపు రూ.50 కోట్లు లాభాలు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం చిరు అదే జోష్‌తో ‘భోళాశంకర్‌’ (Bhola Shankar) సినిమా చేస్తున్నాడు. మెహెర్‌ రమేష్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ చివరి దశలో ఉంది. ఇప్పటివరకు రిలీజైన పోస్టర్లు సినిమాపై మంచి అంచనాలను క్రియేట్‌ చేశాయి. మే డే సందర్భంగా చిత్ర బృందం స్పెషల్‌ పోస్టర్ను విడుదల చేసింది. టాక్సీ దగ్గర చిరంజీవి నిలబడిన స్టిల్స్‌ అదిరిపోయాయి. యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్‌ (Keerthy Suresh) చిరంజీవికి చెల్లెలిగా నటిస్తుండగా.. తమన్నా (Tamannaah) హీరోయిన్‌గా చేస్తోంది.