Balagam: సంగీత దర్శకుడికి దాదాసాహెబ్​ ఫాల్కే​!

Hyderabad: టాలీవుడ్ (Tollywood) లో చిన్న సినిమాగా వచ్చి భారీ విజయాన్ని అందుకున్న చిత్రం బలగం (Balagam). ఈ సినిమాతో జబర్దస్త్ కమెడియన్ వేణు (Venu) దర్శకుడిగా పరిచయం అయ్యారు. ప్రియదర్శి (Priyadarshi), కావ్య కళ్యాణ్ రామ్ (Kavya Kalyan Ram) ప్రధాన పాత్రల్లో నటించిన బలగం సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది.
బాక్స్ ఆఫీస్ వద్ద రూ.50 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కలెక్షన్స్ పరంగానే కాకుండా అవార్డులను కూడా దక్కించుకుని రికార్డులను సృష్టిస్తోంది. బలగం సినిమాకు ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులు దక్కిన సంగతి తెలిసిందే.

ఇటీవల జరిగిన ఫ్రెంచ్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ఏకంగా 9 అవార్డులను కైవసం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా పలు కేటగిరీలలో మొత్తం 40కు పైగా అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి. తాజాగా మరో అంతర్జాతీచ అవార్డును గెలుచుకుంది బలగం. ఈ సినిమాకు భీమ్స్ సెసిరోలె(Bheems Ceciroleo) సంగీతం అందించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జరుగుతున్న 13వ దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో (Dada Saheb Phalke International Film Festival) బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా అవార్డును అందుకున్నారు.
81 దేశాల నుంచి 780 మంది పోటీ పడగా బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా భీమ్స్‌ అవార్డును అందుకోవడంతో టాలీవుడ్ ప్రముఖులు, ఆడియన్స్ అభినందనలు తెలియజేస్తున్నారు. ఇక, ఈ సినిమాను మరిన్ని ఇంటర్నేషనల్ అవార్డ్స్ కు, ఆస్కార్ కు కూడా పంపిస్తామని నిర్మాత దిల్ రాజు (Dil Raju) చెప్పిన సంగతి తెలిసిందే.