Money: ల‌క్కీ ఫెల్లో.. ఇంటి గోడ‌ల్లో 3 కోట్లు!

Spain: రిటైర్మెంట్ త‌ర్వాత ప్ర‌శాంత‌మైన జీవితాన్ని గ‌డ‌పాల‌ని ఓ ఇల్లు కొనుక్కున్న వ్య‌క్తికి బంప‌ర్ ఆఫ‌ర్(money) త‌గిలింది. ఆ ఇంటి గోడ‌ల్లో ఒక‌టి కాదు రెండు కాదు మ‌న క‌రెన్సీలో ఏకంగా 3 కోట్ల 75 ల‌క్ష‌ల రూపాయ‌ల నోట్ల క‌ట్టలు(money) దొరికాయి. దాంతో ఆ వ్య‌క్తి ఎగిరి గంతేసాడు. కానీ పాపం ఆ ఆనందం క్ష‌ణాల్లో ఆవిరైపోయింది. అస‌లు ఏం జ‌రిగిందంటే.. స్పెయిన్‌కి చెందిన టోనో అనే వ్య‌క్తి బిల్డ‌ర్‌గా ప‌నిచేస్తున్నాడు. ఓ ఇంటిని కొనుక్కుని దానికి మార్పులు చేర్పులు చేసుకుంటున్న క్ర‌మంలో ఓ గోడ‌లో ఏవో క్యాన్లు బ‌య‌ట‌ప‌డ్డాయి. గోడ ప‌గ‌ల‌గొట్టి చూడ‌గానే కొన్ని వంద‌ల క్యాన్లు బ‌య‌ట‌ప‌డ్డాయి. అందులో నోట్ల క‌ట్ట‌లు పెట్టి ఉన్నాయి. తీసి చూస్తే అవి స్పెయిన్ క‌రెన్సీ నోట్లు.

అలా నోట్ల‌ క‌ట్ట‌లు బ‌య‌ట‌పడ్డాయి. మ‌న ఇండియ‌న్ క‌రెన్సీతో పోలిస్తే 3 కోట్ల రూపాయ‌ల‌కు పైగానే డ‌బ్బు దొరికింది. దాంతో ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు. వెంట‌నే ఆ నోట్ల క‌ట్టలు తీసుకుని స్థానిక బ్యాంక్‌కు వెళ్లాడు. అయితే అందులో చాలా నోట్లు పాత‌వ‌ని, అవి ఇప్పుడు చెల్ల‌వ‌ని, ఎక్స్‌చేంజ్ కూడా చేయ‌లేమ‌ని బ్యాంక్ చెప్ప‌డంతో నిరాశ‌ప‌డ్డాడు. అలా 3 కోట్లలో 30 ల‌క్ష‌లు మాత్ర‌మే తీసుకోగ‌లిగాడు. అయితే చెల్ల‌ని నోట్ల‌ను మాత్రం ప‌డేయ‌న‌ని వాటిని పాత‌కాలం నాటి గుర్తులుగా పెట్టుకుంటాన‌ని అన్నాడు. మ‌రో ఇంట్రెస్టింగ్ విష‌యం ఏంటంటే.. ఆ ఇల్లు 150 ఏళ్ల నాటిది. ఆన్‌లైన్‌లో సేల్‌కి పెడితే ముచ్చ‌ట‌ప‌డి కొనుక్కున్నాడ‌ట‌. అలా అదృష్టం క‌లిసివ‌చ్చింది.