Balakrishna: బాల‌య్య బ్యాక్ టు బ్యాక్ లోడింగ్..!

Hyderabad: నందమూరి నటసింహం బాలకృష్ణ(Balakrishna) వరుస సినిమాలతో యంగ్​ హీరోలకు పోటీ ఇస్తున్న సంగతి తెలిసిందే. అన్​స్టాపబుల్(Unstoppable)​ అంటూ బుల్లితెరపైనా మెప్పించిన బాలయ్య కెరీర్​లోనూ అన్​స్టాపబుల్​గా దూసుకుపోతున్నారు. ఈ ఏడాది వీరసింహా రెడ్డి(Veerasimha Reddy) సినిమాతో బ్లాక్​బస్టర్​ హిట్​ అందుకున్న బాలయ్య అదే జోష్​లో వరుస ప్రాజెక్టులకు సైన్​ చేశారు. ఇక, ప్రస్తుతం బాలయ్య NBK108 షూటింగ్​తో బిజీగా ఉన్నారు. ఈ సినిమాను వరుస హిట్లతో దూసుకుపోతున్న ప్రముఖ డైరెక్టర్​ అనిల్​ రావిపూడి(Anil Ravipudi) రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య జోడీగా శ్రుతీ హాసన్(Shruti Haasan)​ నటిస్తోంది. ఇక, ఈ సినిమాలో ఎప్పుడూ చూడని కొత్త బాలయ్యను చూస్తారంటూ అనిల్​ రావిపూడి హైప్​ క్రియేట్​ చేశారు. ఈ సినిమా నుంచి రిలీజ్​ చేసిన ఫస్ట్​లుక్​ అభిమానులను బాగా ఆకట్టుకుంది. ఇంకా టైటిల్​ ఖరారు కాని ఈ సినిమా దసరా కానుకగా విడుదల కానుంది. ఈ సినిమా షైన్​ స్క్రీన్ బ్యానర్​పై రూపొందుతోంది.

కాగా, ఈ సినిమా తర్వాత బోయపాటి శ్రీనివాస్​ దర్శకత్వంలో NBK109 సినిమా రూపొందనుంది. బాలయ్య, బోయపాటి కాంబినేషన్లో ఇది నాలుగో సినిమా​. BB4గా రానున్న ఈ సినిమాను 14 రీల్స్​ ప్లస్​ నిర్మించనుంది. పైసా వసూల్​ సినిమాతో బాలయ్యలోని కొత్త యాంగిల్​ని పరిచయం చేసిన డైరెక్టర్​ పూరీ జగన్నాథ్​తో బాలయ్య మరో సినిమా ఓకే అయింది. NBK110గా తెరకెక్కనున్న ఈ సినిమాను పూరీ, ఛార్మీ సంయుక్తంగా పూరీ కనెక్ట్స్​ పతాకంపై నిర్మించనున్నారు. ఈ ఏడాది వాల్తేరు వీరయ్యతో హిట్​ కొట్టిన డైరెక్టర్​ బాబి బాలయ్యతో NBK111 చిత్రాన్ని రూపొందించనున్నారు. ఈ సినిమాను సితార ఎంటర్​టైన్​మెంట్స్​ సంస్థ నిర్మించనుంది. గీత గోవిందం, సర్కారువారి పాట సినిమాలతో హిట్​ కొట్టిన డైరెక్టర్​ పరుశరామ్​ బాలయ్యతో NBK112 సినిమాను రూపొందించనున్నారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్​ నిర్మించనుంది.