Teja: సినిమాలను చంపేది OTT కాదు పాప్‌కార్న్
Hyderabad: పాప్‌కార్న్(popcorn) వల్లే సినిమాలు చనిపోతున్నాయని అంటున్నారు ప్రముఖ దర్శకుడు తేజ(teja). హీరో గోపీచంద్(gopichand) నటిస్తున్న రామబాణం(ramabanam) సినిమా రిలీజ్ అవనున్న సందర్భంగా టీం వీరిద్దరితో చిట్‌చాట్ పెట్టించారు. ఈ సందర్భంగా గోపీచంద్, తేజ చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు. అయితే ఓటీటీ కారణంగా సినిమా చనిపోతోంది అని ఎప్పటినుంచో ఉన్న డిబేట్‌పై తేజ ఆసక్తికర కామెంట్స్ చేసారు. “సినిమా చచ్చిపోయేది ఓటీటీ వల్లో టీవీ వల్లో కాదు. పాప్‌కార్న్ వల్ల. ఎందుకంటే.. ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బైక్ మీద సినిమాకు వెళ్లాలనుకుంటే.. మల్టీప్లెక్సులకు వెళ్తారు. చూడటానికి వీలుగా ఉంటుందని. ఊరికే వచ్చి సినిమా చూసి మాత్రం వెళ్లరు. కచ్చితంగా పాప్‌కార్న్, సమోసాలు కొనుక్కుని తింటారు. స్క్రీన్ మీద ఇంట్రెస్టింగ్ ఫైటింగ్ సీన్ వస్తున్నప్పుడు వాళ్లు పాప్‌కార్న్, సమోసాలు తింటూ చూస్తారు. వాళ్ల ధ్యాస తిండిపై ఉంటుంది. అదీకాకుండా మల్టీప్లెక్సుల్లో పాప్‌కార్న్ చాలా ఖరీదు. దాంతో సినిమాకు వెళ్లకపోవడమే మంచిది అనుకుని ఆగిపోతారు. బాలీవుడ్లో కూడా ఇదే పరిస్థితి. అందుకే సినిమాను ఎప్పుడైనా సింగిల్ స్క్రీన్‌లో చూడటమే మంచిది” అని తెలిపారు తేజ. దీనిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందిస్తూ.. ఇది పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశం అని అన్నారు.