Agent సినిమాపై ట్రోల్స్.. స్పందించిన అమల
Hyderabad: అఖిల్ అక్కినేని (Akhil Akkineni) హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ‘ఏజెంట్’ (Agent). ఈ సినిమా ఏప్రిల్ 28న గ్రాండ్‌గా విడుదలైంది. అయితే ఊహించని విధంగా సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చింది. దీంతో రెండేళ్లకు పైగా ఈ సినిమా కోసం కష్టపడిన అఖిల్, సురేందర్ రెడ్డి (Surender Reddy)ని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ఆశ్చర్యం ఏంటంటే అక్కినేని ఫ్యాన్స్ కూడా ఏజెంట్ సినిమాపై సోషల్ మీడియాలో ట్రోల్స్, మీమ్స్ షేర్ చేస్తున్నారు.
ఈ సినిమా కోసం అఖిల్ రెండేళ్లకు పైగా కష్టపడ్డాడు. కానీ సినిమా మాత్రం ఘోరంగా ఫెయిల్ అయ్యింది. తాజాగా ఈ సినిమాపై వస్తున్న ట్రోల్స్ పై అఖిల్ తల్లి అక్కినేని అమల స్పందించారు. ఏజెంట్ సినిమాతోపాటు, అఖిల్‌పై వస్తున్న ట్రోల్స్ పైనా మాట్లాడారు. సినిమాలో లోపాలున్నాయని కానీ సినిమాను బాగా ఎంజాయ్ చేశానని అన్నారు అమల.
‘ట్రోలింగ్ అనేది జరుగుతుంది. ట్రోలింగ్ అనేది ఇన్సెక్యూరిటీ వల్ల జరుగుతుందని అర్థం చేసుకున్నాను. నిన్న ‘ఏజెంట్’ సినిమా చూశారు. సినిమాను ఎంజాయ్ చేశాను. అయితే సినిమలో కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. కానీ ఏజెంట్ సినిమాను ఓపెన్ మైండ్‌తో చూస్తే ఆశ్చర్యపోతారు. థియేటర్లో సినిమా చూసిన సమయంలో సగం మంది కంటే ఎక్కువ మంది మహిళలు, అమ్మలు, అమ్మమ్మలు ఉన్నారు. యాక్షన్ సీన్లు వస్తున్నప్పుడు అరుపులు, కేకలతో ఎంజాయ్ చేశారు. అయితే ఒకటి చెప్పగలను. అఖిల్ నెక్స్ట్ సినిమా ఇంకా బెటర్‌గా ఉంటుంది.’ అని చెప్పారు. మొత్తానికి ఎంతో కష్టపడి తీసిన అఖిల్ ‘ఏజెంట్’ సినిమా ఇలా నెగెటివ్ టాక్‌తో బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా విఫలమయ్యేలా కనిపిస్తోంది. హిప్ హాప్ తమీళ సంగీతం అందించారు.