Agent: థియేటర్లో సామ్!
Hyderabad: అఖిల్ అక్కినేని(Akhil Akkineni) హీరోగా సురేందర్ రెడ్డి(Surendar Reddy) దర్శకత్వంలో వచ్చిన సినిమా ఏజెంట్(Agent). ఈ సినిమా ఏప్రిల్ 28న విడుదలై మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమాపై సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్ వస్తున్న సంగతి తెలిసిందే. కాగా, తాజాగా ఈ సినిమాని టాలీవుడ్ స్టార్ హీరోయిన్, అక్కినేని నాగచైతన్య మాజీ భార్య సమంత(samantha) అభిమానులతో కలిసి చూసి ఎంజాయ్ చేశారు.
ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత, నాగ చైతన్య నాలుగేళ్ల తర్వాత తమ వివాహ బంధానికి స్వస్థి చెప్పిన సంగతి తెలిసిందే. కాగా విడిపోయిన తర్వాత ఒక్కసారి కూడా వీళ్ళు కలిసి మాట్లాడుకోవడం కానీ ఒకరి గురించి ఒకరు నేరుగా మాట్లాడటం కానీ జరగలేదు. నాగ చైతన్య సమంతతో స్నేహపూర్వకంగా ఉండడానికి సిద్ధంగా ఉన్న సమంత మాత్రం లేదనే విషయం రీసెంట్ గా ఎన్నో ఇంటర్వ్యూస్ చూసినప్పుడు అర్థం అయ్యింది. విడాకులు తీసుకున్న తర్వాత ఆమె నాగార్జున గురించి కూడా ఎక్కువగా ప్రస్తావించలేదు, కానీ అక్కినేని అఖిల్ తో మాత్రం మొదటి నుండి స్నేహపూర్వకంగా ఉంటోంది సామ్.
ఆయన ప్రతీ పుట్టినరోజు కి శుభాకాంక్షలు ప్రతేకంగా తెలియచేస్తుంది, అలాగే సమంతకి ఆరోగ్యం బాగాలేనప్పుడు అక్కినేని కుటుంబం నుండి తొందరగా కోలుకోవాలి అంటూ కామెంట్స్ పెట్టిన ఏకైక వ్యక్తి అఖిల్ మాత్రమే. దీనిని బట్టీ వీళ్లిద్దరి మధ్య ఆత్మీయ బంధం ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
భారీ అంచనాల నడుమ విడుదలైన ఏజెంట్ సినిమాకి మొదటి షో నుండే డిజాస్టర్ టాక్ వచ్చింది, ఫ్యాన్స్ ని కూడా ఈ చిత్రం నిరాశపరిచింది.అయితే ఈ సినిమాని సమంత AMB సినిమాస్ లో అభిమానుల సమక్షం లో చూసింది.అభిమానుల కేరింతల మధ్య ఆమె కూడా బాగా ఎంజాయ్ చేసిందట, ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.